సిబ్బంది లేరు.. ఫ్యాకల్టీ లేదు.. డాక్టర్లు అంతకంటే కూడా లేరు.. కేవలం అద్దె ప్రాతిపదికన డాక్టర్లను తీసుకువచ్చి తనిఖీల సమయంలో తూతూ మంత్రంగా వ్యవహరించి పంపించి వేస్తున్నారు.. అద్దె డాక్టర్లు అద్దె సిబ్బంది తో నేషనల్ మెడికల్ కౌన్సిల్ అధికారులను మభ్య పెడుతున్నారు ..అయితే అక్కడితో సరిపోయేది.. మెడికల్ కాలేజీల అనుమతి కోసం ఏకంగా నేషనల్ మెడికల్ కౌన్సిల్ సిబ్బందికి లంచాలు ఇస్తున్నారు ..అది కూడా కోట్లల్లో డబ్బులు చెల్లిస్తున్నారు. ఆంధ్ర నుంచి ఢిల్లీ వరకు ఈ అక్రమాల దందా నడుస్తూనే ఉంది.. దానికంటే ముఖ్యం కనీస వసతులు కూడా లేవు అయినప్పటికీ మెడికల్ కాలేజీ నీ వీళ్ళు నడుపుతున్నారు.. లంచాలు ఇచ్చి మెడికల్ కౌన్సిల్ని మ్యారేజ్ చేసి అనుమతులు తెచ్చుకొని మెడికల్ సీట్ల పేరుతోటి కోట్లు దండుకుంటున్నారు ప్రైవేటు మెడికల్ కాలేజ్ దక్షిణాది నుంచి ప్రారంభం అయ్యిందని సిబిఐ చెప్పింది… ఈ మేరకు ఆంధ్ర తెలంగాణ సంబంధించిన పలు మెడికల్ కాలేజీ యాజమాన్యాల పైన కేసులను నమోదు చేసింది.. అత్యంత నమ్మకమైన వరంగల్లోని ఫాదర్ కొలంబో మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజీ పైన కూడా కేసు నమోదు చేశారు ..దీనికి సంబంధించి ట్రస్ట్ ఫాదర్ జోసఫ్ కొమ్మిరెడ్డి పైన కేసు నమోదు చేశారు.. దీంతోపాటు హైదరాబాద్ విజయవాడ వైజాగ్ కు సంబంధించిన డాక్టర్ల పైన కేసులను నమోదుచేసి విచారణ చేస్తున్నారు.. ఆంధ్ర తెలంగాణలో చాలా మెడికల్ కాలేజ్ ఆ ప్రైవేట్ మల్లి పరిస్థితి ఇదే.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్‌ఎంసీ (నేషనల్ మెడికల్ కమిషన్) లంచం కుంభకోణంలో వరంగల్ నగరానికి చెందిన ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీ కూడా విచారణలో పట్టుబడింది. వరంగల్‌లోని ఫాదర్ కొలంబో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ట్రస్టీ ఫాదర్ జోసెఫ్ కొమ్మారెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేసింది.
సీబీఐ ఎఫ్ఐఆర్ ప్రకారం, మెడికల్ కాలేజీ తనిఖీలు అనుకూలంగా రావాలన్న ఉద్దేశంతో రెండు విడతల్లో .20 లక్షలు, 46 లక్షలు మధ్యవర్తుల ద్వారా ఎన్‌ఎంసీ అధికారులకు లంచంగా చెల్లించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఆరుగురిని సీబీఐ అరెస్ట్ చేయగా, మరికొంతమందిని విచారణకు పిలవనుంది. ఈ కుంభకోణానికి దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించిన మాఫియా నేతృత్వం వహించినట్లు సీబీఐ తెలిపింది. అనంతపురం కదిరికి చెందిన డాక్టర్ బి. హరి ప్రసాద్, హైదరాబాద్ శ్రీనగర్ కాలనీకి చెందిన డాక్టర్ అంకం రాంబాబు, విశాఖపట్నం అక్కయ్యపాలెం ప్రాంతానికి చెందిన డాక్టర్ కృష్ణ కిషోర్ ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్టు గుర్తించింది. డాక్టర్ హరి ప్రసాద్ పలువురు మెడికల్ కాలేజీలకు కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తూ, డమ్మీ ఫ్యాకల్టీ ఏర్పాట్లు, ఎన్‌ఎంసీ అనుమతుల కోసం లేఖల సమకూర్పు, లంచాల వసూలు వంటి అక్రమ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారని ఆరోపణలు ఉన్నాయి.
విశాఖ గాయత్రి మెడికల్ కాలేజీ డైరెక్టర్ వెంకట్ నుంచి 50 లక్షలు వసూలు చేసి, ఆ మొత్తాన్ని హవాలా మార్గంలో ఢిల్లీకి పంపించినట్లు వివరాలు వెలుగు చూశాయి. వరంగల్ ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీ క్లియరెన్స్‌ల కోసం రెండు విడతల్లో భారీ మొత్తంలో లంచం చెల్లించారని సీబీఐ పేర్కొంది..ఈ వ్యవహారంలో ఆరోగ్యశాఖ డైరెక్టర్ పూనమ్ మీనా పేరు కూడా ఎఫ్‌ఐఆర్‌లో ఉంది. తన సిబ్బంది పియూష్ మల్యాన్ ద్వారా తనిఖీ తేదీలను ముందుగానే తెలుసుకోవాలని ఆదేశించినట్లు సీబీఐ వెల్లడించింది. ఈ కుంభకోణానికి సంబంధించి సీబీఐ ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 40కు పైగా ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో మెడికల్ కాలేజీలపై దర్యాప్తు కొనసాగుతోంది..
Love: ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోమని అడిగినందుకు ఘోరం..