Vallabhaneni Vamsi: కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ ఇటీవల జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో, ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో ఉన్న ఓ వైసీపీ నేత ఇంట్లో వంశీని మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్నినాని ఆత్మీయంగా కలిసి పరామర్శించారు. అలాగే, వంశీ ఆరోగ్యంపై ఇరువురు నేతలు అడిగి తెలుసుకున్నారు.
Read Also: Surya Sethupathi: విజయ్ సేతుపతి కొడుకుపై ప్రశంసల వర్షం.. కానీ డిజాస్టర్ కలెక్షన్?
అయితే, వల్లభనేని వంశీ, కొడాలి నాని, పేర్నినాని మధ్య కొంతసేపు పలు అంశాలపై చర్చలు జరిగాయి. వంశీతో పాటు, అన్ని కేసుల్లో అరెస్టైన ఆయన అనుచరులను కూడా కొడాలి నాని పరామర్శించారు. ఈ ఉదయం కోర్టు విధించిన షరతుల మేరకు గుడివాడ, గన్నవరం పోలీస్ స్టేషన్లలో కొడాలి నాని, వల్లభనేని వంశీ సంతకాలు చేశారు.