కరోనా మహమ్మారి ఎక్కడ ఎప్పుడు ఎలా సోకుతుందో తెలియని పరిస్థితి.. ముఖ్యంగా ఎక్కువమంది గుమ్మిగూడే ప్రాంతాల్లో వేగంగా విస్తరిస్తోంది ఈ వైరస్.. తాజాగా శ్రీకాకుళం నగరంలోని వైటీసీలో కోవిడ్ కలకలమే సృష్టించింది.. సూపర్-60 కోచింగ్ తీసుకుంటున్న 28 మంది విద్యార్ధులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. ఇటీవలే వారం రోజులు సెలవులపై ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు తిరిగి కోచింగ్ సెంటర్ చేరుకున్నారు.. ఈనెల 2వ తేదీ నుంచి శిక్షణా తరగతులు తిరిగి ప్రారంభం అయ్యాయి.. ఇళ్ల నుంచి…
కరోనా సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుముఖం పట్టడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.. మరోవైపు.. కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు హెచ్చరికలు కలవరపెడుతున్నాయి.. ఈ తరుణంలో కోవిడ్ పరిస్థితి, థర్డ్ వేవ్ సన్నద్ధత పై గ్రూప్ అఫ్ మిమిస్టర్స్ సమావేశం జరిగింది.. మంత్రి ఆళ్లనాని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సబ్ కమిటీ సభ్యులు, మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కన్నబాబు, అప్పలరాజు, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు…
ఓవైపు సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే.. మరోవైపు ప్రజలకు మౌలికసదుపాయాల కల్పనపై ఫోకస్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అందులో భాగంగా.. 2024 నాటికి రాష్ట్రంలోని ప్రతీ ఇంటికీ మంచినీటి కుళాయి ఏర్పాటుచేస్తామని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఇవాళ ఆర్డబ్ల్యూఎస్ టెక్నికల్ హ్యాండ్‌బుక్‌ను ఆవిష్కరించిన మంత్రి పెద్దిరెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని జగనన్న కాలనీల్లో నిర్మాణ పనులకు ఆర్‌డబ్ల్యుఎస్ ద్వారా నీటి వసతి కల్పిస్తామన్నారు.. 2024 నాటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మంచినీటి…
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారం ఇప్పుడు లోక్‌సభ స్పీకర్ చేతిలో ఉంది.. ఓ వైపు వైసీపీ సభ్యులు.. ఆయనపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదులు చేస్తుంటే.. మరోవైపు.. వారి ఫిర్యాదులను పరిగణలోకి తీసుకోవద్దు అంటూ రఘురామ.. స్పీకర్‌ను కోరారు.. ఈ పరిణామాలపై స్పందించిన వైసీపీ పార్లమెంట్ చీఫ్ విప్ మార్గాని భరత్.. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పార్లమెంట్ సభ్యత్వం బర్తరఫ్ చేయడం తథ్యం అని నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. ఆర్టికల్ 10 ప్రకారం చర్యలు తప్పవని..…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కారణంగా డ్రైవర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటులన్నారు. వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం వాహనమిత్ర పేరుతో ఆర్ధిక సాయం చేస్తున్నది. ఇప్పటి వరకు రెండుసార్లు వాహనమిత్ర సాయం అందించింది. కాగా ఇప్పుడు మూడోసారి కూడా డ్రైవర్లకు వాహనమిత్ర ఆర్ధిక సాయం చేస్తున్నది. ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆన్లైన్ ద్వారా వాహనమిత్ర సాయాన్ని విడుదల చేయబోతున్నారు. ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు రూ.10వేల చొప్పున ఆర్ధికసాయం చేయబోతున్నారు. ఈ వాహనమిత్ర పథకం ద్వారా రాష్ట్రంలోని 2.48 లక్షలమంది…
వైసీపీ రెబల్ నేత, ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారం ఇంకా హాట్ టిపిక్‌గానే సాగుతోంది.. ప్రభుత్వంపై ఆరోపణలు, కేసులు, అరెస్ట్, జైలు, ఆస్పత్రి, బెయిల్, ఫిర్యాదులు.. ఇలా కొనసాగుతూనే ఉంది.. ఇక, కాసేపటి క్రితమే లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాతో సమావేశమయ్యారు ఎంపీ రఘురామకృష్ణరాజు… తనపై దాడి విషయంలో.. ప్రివిలేజ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసిన ఆయన.. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.. ఇక, వైసీపీ వెబ్సైట్లో తన పేరును తొలగించడాన్ని ఎంపీ రఘురామ ప్రస్తావించారు.…
ఏపీలోని అన్ని మున్సిపాలిటీల్లో త్వరలోనే ఆకస్మిక తనిఖీలు చేపడతామని ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈ మేరకు పురపాలిక, నగరపాలికల కమిషనర్లతో మంత్రి బొత్స వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, క్లాప్ కార్యక్రమం అమలుపై బొత్స సమీక్షించారు. మున్సిపాలిటీల్లో చెత్త సేకరణ, తరలింపునకు 3100 కొత్త ఆటోల కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వచ్చే నెల 8 నుంచి 100 రోజులపాటు క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. నివాస,…
ఆంధ్రప్రదేశ్‌లో గవర్నర్ కోటాలో కొత్తగా ఎంపిక కానున్న ఆ నలుగురు ఎమ్మెల్సీలు ఎవరు? అనే ఉత్కంఠకు తెరపడింది.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన ఆ నలుగురు ఎమ్మెల్సీలకు ఆమోదముద్ర వేశారు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్.. సాయంత్రం తన శ్రీమతి వైఎస్ భారతితో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. సరిగ్గా 40 నిమిషాల పాటు గవర్నర్ దంపతులు విశ్వభూషణ్ హరిచందన్, సుప్రవా హరిచందన్‌తో సమావేశం జరిగింది.. ఈ సందర్భంగా గవర్నర్ కోటాలో…