ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు ముగిసిన తరువాత చంద్రబాబు నాయుడు కుప్పం లో పర్యటించబోతున్నారు. కుప్పం నియోజక వర్గంలోని గ్రామ పంచాయతీల్లో అత్యధికభాగం వైసీపి కైవసం చేసుకున్నది. ఈ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి కుప్పం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు నాయుడు ఈరోజు నుంచి మూడు రోజులపాటు కుప్పంలో పర్యటించబోతున్నారు. కుప్పం నియోజక వర్గంలోని కార్యకర్తలతో సమావేశం కాబోతున్నారు. దిశానిర్దేశం చేసేందుకు బాబు పర్యటించబోతున్నారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లి, అక్కడి నుంచి రోడ్డు…
ఏపీ ఉద్యోగ సంఘాల మధ్య మళ్లీ గొడవ ప్రారంభమైంది. తమతో కలవకుండా వీఆర్వోలను కొన్ని ఉద్యోగ సంఘాలు అడ్డుకుంటున్నాయంటూ ఏపీ జేఏసీ అమరావతి సంఘం ఛైర్మన్ బొప్పరాజు విమర్శలు గుప్పించారు. పరోక్షంగా ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి పై బొప్పరాజు ఆరోపణలు చేసారు. ఆయన మాట్లాడుతూ… వీఆర్వో సంఘాలు మా ఏపీ జేఏసీతో కలవడం కొన్ని ఉద్యోగ సంఘాల నాయకులకి ఇష్టం లేదు. అందుకే వీఆర్వో సంఘాల నేతలపై బెదిరింపులకి పాల్పడుతున్నారు. వీఆర్వోల పై ఏసీబీతో దాడులు…
ఏపీ మంత్రి పేర్ని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దుర్గ గుడి ఉద్యోగుల అవినీతిపై ఏసీబీ దాడులు చేస్తే మంత్రి వెల్లంపల్లిపై ఆరోపణలు చేయడం శోచనీయమన్నారు. అక్రమాలు సహించేదే లేదంటూ ప్రభుత్వమే తనిఖీలు చేయిస్తోందని… దుర్గగుడి ఉద్యోగులపై ఏసీబీ సోదాల విషయంలో రాజకీయ ఆరోపణలు చేయడం దారుణమని మండిపడ్డారు. దుర్గ గుడి ఈవో తప్పు చేశారని.. లెక్క తేలితే బొక్కలు పగులుతాయని హెచ్చరించారు. అవినీతిని ఊపేక్షించే విషయంలో ఈవో లేదు.. డీవో లేదు.. అందరి మీద…