Home
Andhra Pradesh
Andhra Pradesh News
-
వచ్చేవారం కేఆర్ఎంబీ సమావేశం.. రెండు రాష్ట్రాలకు నోటీసులు
కృష్ణా నది జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఈ నేపథ్యంలో ఈ నెల 27న జరగనున్న కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.. ఇప్పటికే కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఉమ్మడిగా సమావేశం నిర్వహించగా.. ఈ నెల 27వ తేదీన సమావేశం నిర్వహిస్తున్నామని.. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా రెండు తెలుగు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ నోటీసులు జారీ చేసింది. ఇక, నోటీసులతో భేటీ అజెండాను జతపరిచిన కేఆర్ఎంబీ.. కృష్ణాజలాల్లో రాష్ట్రాల వాటా, అజెండాలో… -
శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్‌న్యూస్
శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పారు అధికారులు.. కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో మార్పులు చేసుకోగా.. ఈ నెల 18 నుంచి స్వామివారి స్పర్శ దర్శనానికి భక్తులను అనుమతించనున్నట్లు ఈవో కేఎస్ రామారావు ప్రకటించారు.. ఇక, ప్రతిరోజు గర్భాలయంలో ఏడు విడతలుగా అభిషేకాలు, నాలుగు విడతలుగా సామూహిక అభిషేకాలు నిర్వహిస్తామని తెలిపిన ఆయన.. కోవిడ్ నేపథ్యంలో భక్తులను పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతించనున్నట్లు వెల్లడించారు. మరోవైపు.. అంతరాలయంలో భ్రమరాంబదేవికి ఆర్జిత కుంకుమార్చనలు జరుగుతాయని పేర్కొన్నారు.. వేదాశీర్వచనాలు, నవావరణ… -
మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదు : విపత్తులశాఖ కమిషనర్
రాగల 24 గంటల్లో వాయువ్య మరియు పశ్చిమమధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో ఒడిశా- ఉత్తరాంధ్ర తీరం వెంబడి అల్పపీడనం ఏర్పడనుంది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. అక్కడక్కడ ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. తీరం వెంబడి గంటకు 50-60 కీ.మీ వెగంతో గాలులు వీస్తుండటంతో సముద్రం అలజడిగా ఉంటుంది. కావున మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదు అని… -
వైఎస్ ప్రకాశ్ రెడ్డిని విచారిస్తున్న సీబీఐ
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో 71వ రోజు విచారణలో భాగంగా వైఎస్ కుటుంబంలోని వైఎస్ ప్రకాశ్‌రెడ్డిని కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) విచారిస్తుంది. పులివెందుల ఆర్అండ్బీ అతిథిగృహంలో జరుగుతోన్న ఈ విచారణలో వివేక హత్యకు సంబంధించి పలు కోణాల్లో వారిని ప్రశ్నిస్తున్నారు. వైఎస్ వివేకాకు ఏమైనా ఆస్తి తగాదాలు, రాజకీయ విభేదాలు, చంపుకునేంత వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో విచారిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. కాగా, వైఎస్ కుటుంబంలో పెద్ద వయసు గల వ్యక్తి వైఎస్… -
ఆన్ లైన్లో జీవోలు పెట్టకూడదని ఏపీ ప్రభుత్వం నిర్ణయం…
ఇకపై ఆన్ లైన్లో జీవోలు పెట్టకూడదని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీవోలను ఆఫ్ లైన్ లోనే పెట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పొరుగునున్న రాష్ట్రాల్లో అమలవుతోన్న విధానాన్ని అవలంభించాలని భావించింది ప్రభుత్వం. దాంతో ఇకపై పబ్లిక్ డొమైనులో ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు ఏవి కనిపించవు. అయితే ఇలా జీవోలను పబ్లిక్ డొమైనుల్లో ఉత్తర్వులు ఉంచడం 2008 న ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ విధానానికి బ్రేక్ వేసింది. చూడాలి మరి ఇంకా… -
లైవ్: సీఎం జగన్ మనబడి నాడు-నేడు
-
బీటెక్ విద్యార్ధి రమ్య హత్య కేసులో వెలుగులోకి షాకింగ్ నిజాలు !
ప్రేమ పేరుతో అమ్మాయిలను బలితీసుకుంటూనే ఉన్నారు దుర్మార్గులు. ఎన్ని శిక్షలు వేసిన ఉన్మాదుల ఆగడాలకు బ్రేక్ పడడం లేదు. తాజాగా గుంటూరు జిల్లాలో బీటెక్ విద్యార్థిని హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా మంగళగిరి రోడ్డులో పరమాయకుంట. అక్కడికి బైకుపై బీటెక్ విద్యార్థిని రమ్యతోపాటు శశికృష్ణ వచ్చాడు. అప్పటివరకూ బాగానే మాట్లాడుకున్నారు. ఏం జరిగిందో కానీ.. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన రమ్య శశిని… -
ఏపీలో నేటి నుంచి మోగనున్న బడి గంటలు
కరోనా కారణంగా ఏడాదిన్నరగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఆ మధ్యలో తెరుచుకున్నా వైరస్ మళ్లీ విజృంభించడంతో మరొసారి విద్యా సంస్థలను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పాఠశాలలు తెరిచేందుకు ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ఇవాళ్టి నుంచి ఏపీలో స్కూళ్లు పునప్రారంభం కానున్నాయి. ప్రత్యక్ష తరగతులు జరగనున్నాయి.కరోనా కష్టాలు, సవాళ్లు అన్నింటినీ అధిగమించి.. పాఠశాలల ప్రారంభానికి రెడీ అయింది ప్రభుత్వం. థర్డ్ వేవ్ హెచ్చరికలతో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ అధికారులు.. తరగతుల నిర్వహణపై… -
ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో సీఎం జగన్ పర్యటన
నాడు-నేడు కార్యక్రమంతో ఏపీలో ప్రభుత్వ పాఠశాలల దశ, దిశ సమూలంగా మారిపోయాయి. ఈ కార్యక్రమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలో రూపుదిద్దుకున్న ఓ పాఠశాలను నేడు సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అలాగే జగనన్న విద్యాకానుకకు ఇక్కడే శ్రీకారంచుట్టబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో పదో తరగతి వరకు చదువుతున్న 47 లక్షల 32 వేల మంది విద్యార్థులకు… ఈ విద్యా కానుకను అందిస్తారు. జగనన్న విద్యాకానుక కిట్టులో బై లింగువల్ పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్కులు,… -
రమ్య హత్య కేసులో నిందితుడు అరెస్ట్
గుంటూరు బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ఈ రోజు జరిగిన రమ్య హత్యా ఘటన అత్యంత దురదృష్టకరమన్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితున్ని గుర్తించామని గౌతం సవాంగ్ తెలిపారు.ఈ కేసు దర్యాప్తులో స్థానికులు అత్యంత కీలక సమాచారాన్ని పోలీసులకు అందించారని ఆయన తెలిపారు. హత్యకు పాల్పడిన యువకుడిని గుంటూరు అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని..…
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?