పెట్రో బాదుడు కొనసాగుతూనే ఉంది.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. పెట్రో ధరలకు బ్రేక్ పడింది.. ఇక, ఆ తర్వాత మే 4వ తేదీ నుంచి వరుసగా పెరుగుతూ పోతున్నాయి చమురు ధరలు.. ఇప్పటి వరకు 27 సార్లు వడ్డించాయి చమురు కంపెనీలు.. ఇక, ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలను మరింత పెంచారు.. లీటర్ పెట్రోల్‌పై 27 పైసలు, లీటర్ డీజిల్‌పై 30 పైసల చొప్పున పెంచాయి ఆయిల్ సంస్థలు.. తాజా వడ్డింపుతో కలిపి హైదరాబాద్‌లో…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయనున్నారు.. 2021-22లో వివిధ శాఖల్లో భర్తీ చేయనున్న పోస్టుల వివరాలను వెల్లడించనున్నారు.. ఉద్యోగాల ఖాళీలు ప్రకటించి, వాటిని క్రమంగా భర్తీ చేయనున్నారు. విద్య, వైద్యం, పోలీసు శాఖల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది.. అత్యంత పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలని.. అవినీతి, వివక్షకు తావులేకుండా మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ చేపట్టాలని పలు సందర్భాల్లో సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.. మొత్తంగా…
కరోనా సమయంలో కనీసం ప్రజలకు అందుబాటులో ఉండని తెలుగుదేశం పార్టీ, బీజేపీ నేతలు.. హైదరాబాద్‌లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టడం హాస్యాస్పదం.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం విడ్డూరం అని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. మరోవైపు.. నారా లోకేష్‌పై సెటైర్లు వేశారు రోజా.. తనలాగే రాష్ట్రంలోని విద్యార్థి, విద్యార్థులు దద్దమ్మల, చవటల తయారవ్వాలననే దురాలోచనతో పరీక్షలు రద్దు చేయాలని లోకేష్ డిమాండ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు… ప్రజలకి వాక్సిన్ అందరికీ…
వైఎస్ఆర్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే.. క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఆంగ్లో ఇండియన్ మాజీ ఎమ్మెల్యే ఫిలిప్ సి. తోచర్… సీఎం చేతుల మీదుగా వైసీపీ కండువా కప్పుకున్నారు.. ఇక, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కత్తెర సురేష్, కత్తెర హెన్రీ క్రిస్టినా పాల్గొన్నారు.. కాగా, ఈ ఏడాది జనవరిలో టీడీపీకి రాజీనామా చేశారు ఫిలిప్ సి. తోచర్… క్రైస్తవ మతం…
పేదలందరికీ ఇళ్లు పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లాల్లో ప్రత్యేకంగా నియమించిన జేసీలతో క్యాంపు కార్యాలయంలో సమావేశమైన సీఎం వైఎస్ జగన్.. వారికి మార్గనిర్దేశం చేశారు.. మనం ఇప్పుడు కడుతున్న సంఖ్యలో ఇళ్లు గతంలో ఎప్పుడూ కట్టలేదని. దేశంలో కూడా గతంలో ఎన్నడూ ఇలా చేయలేదన్న ఆయన.. 28 లక్షలకుపైగా ఇళ్లు కడుతున్నాం.. 17 వేల లే అవుట్స్‌లో ఈ ఇళ్లను నిర్మిస్తున్నాం.. కొన్ని లే అవుట్స్ .. మున్సిపాల్టీల సైజులో ఉన్నాయి.. అధికారులంతా అందరికీ ఇళ్లు…
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపికే.. అధికార పార్టీ నేతలో.. ప్రతిపక్ష నేతలో.. ఈ విషయంపై తరచూ స్పందిస్తూ ఉంటారు.. విశాఖ నుంచి పాలన కొనసాగించాలని అధికార వైసీపీ వేగంగా ప్రయత్నాలు చేసినా.. కొన్ని అనివార్య కారణాలతో అది వాయిదా పడింది.. ఇక, ఈ మధ్య మళ్లీ తరచూ విశాఖ రాజధానిపై మాట్లాడుతూనే అధికార వైసీపీ నేతలు.. విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావడం ఖాయమని మరోసారి స్పష్టం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ…
బ్యాడ్మింటన్ స్టార్, తెలుగుతేజం పీవీ సింధుకు విశాఖపట్నంలో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించింది ప్రభుత్వం.. విశాఖ రూరల్ చిన గదిలి గ్రామంలో ఆ రెండెకరాలు భూమి కేటాయించారు.. ఇక, చిన గదిలిలోని సింధుకు కేటాయించిన భూమిని పశు సంవర్ధకశాఖ నుంచి యువజన సర్వీసులు, క్రీడలకు బదలాయిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.. ఆ స్ధలంలో సింధూ బ్యాడ్మింటన్ అకాడెమీ, స్పోర్ట్స్ స్కూలు ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు వెలువరిచింది.. భూమిని ఉచితంగా ఇస్తున్నట్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది సర్కార్.. కాగా,…
నూతన విద్యా విధానంతో ఉపాధ్యాయులకు, పిల్లలకు ఎంతో మేలు జరగుతుందన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. విద్యాశాఖ, అంగన్వాడీల్లో నాడు–నేడుపై క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం.. నూతన విద్యా విధానంపై చర్చించారు.. నూతన విద్యా విధానం అమలుకై కార్యాచరణ రూపొందించాలని ఆదేశించిన ఆయన.. రెండేళ్లలో కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు.. ఇక, ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నూతన విద్యా విధానం వల్ల ఉపాధ్యాయులకు, పిల్లలకు ఎనలేని మేలు చేకూరుతుందని.. మండలానికి…