రాష్ట్రంలో ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులు, కోవిడ్ థర్డ్‌వేవ్ సన్నద్ధత, హెల్త్ హబ్స్ ఏర్పాటుపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు కీలక సూచనలు చేశారు.. శిశువులు, చిన్నారులకు ఆక్సిజన్, ఐసీయూ బెడ్ల పెంపుదలపై కార్యాచరణ ప్రణాళికను సీఎంకు వివరించారు అధికారులు.. ఐసీయూ బెడ్లు ఇప్పుడు ఉన్నవాటితో కలిపి మొత్తంగా 1600 ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధంచేశామన్నారు.. ఆక్సిజన్ బెడ్లు ఇప్పుడున్న వాటితో కలిపి 3,777 ఏర్పాటుపై చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.. అలాగే…
వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగంపుపై ఎప్పటి నుంచో కసరత్తు జరుగుతోంది.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.. దీనిపై ఇవాళ కీలక ప్రకటన చేశారు ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగిస్తామని వెల్లడించారు.. వచ్చే ఖరీఫ్ సీజన్లో పగటి పూటే 9 గంటల ఉచిత కరెంట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన ఆయన.. అనంతపురం జిల్లాలో తమకు రాత్రిపూట కరెంట్ ఇవ్వాలని అక్కడి రైతులు…
కరోనా మహమ్మారి వేలాది మంది ప్రాణాలను తీసింది.. సామాన్యులతో పాటు.. వైద్యులు, వైద్య సిబ్బంది కూడా పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయారు.. దీంతో.. వందలాది కుటుంబాలు భారీగా నష్టపోయిన పరిస్థితి.. దీంతో.. వారి కుటుంబాలకు మేం ఉన్నామంటూ భరోసా ఇచ్చారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కరోనాతో చనిపోయిన ప్రభుత్వ వైద్య సిబ్బందికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.. కరోనా బారినపడి చనిపోయిన ప్రభుత్వ వైద్య సిబ్బంది కుటుంబాలకు ఈ పరిహారాన్ని అందించనున్నారు.. కోవిడ్‌తో…
మాన్సాస్ ట్రస్ట్‌పై హైకోర్టు తీర్పును సవాల్ చేసేందుకు సిద్ధం అవుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్.. హైకోర్టు తీర్పుపై స్పందించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. ఇంకా, కోర్టు తీర్పు కాపీ పూర్తిగా చూడలేదు.. దీనిపై అప్పీల్‌కు వెళ్తామని తెలిపారు.. ఇక, మేం ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని స్పష్టం చేసిన ఆయన.. తీర్పులు ఒక్కోసారి అనుకూలంగా వస్తాయి, ఒక్కోసారి వ్యతిరేకంగా వస్తాయని వ్యాఖ్యానించారు.. మరోవైపు లోకేష్ కామెంట్లపై స్పందించిన మంత్రి.. లోకేష్ చిన్నవాడు కాదు.. పెద్దవాడు కాదు.. ట్వీట్ల బాబుగా తయారు…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఈరోజు ఎస్ఎన్బీసీ సమావేశం జరిగింది. 2021-22 వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. స్కూళ్లు, ఆసుపత్రులను నాడు-నేడు కింద అభివృద్ది చేస్తున్నామని, అగ్రి ఇన్ఫ్రా, గృహాలు, ఇతర వ్యవసాయ రంగాల్లో బ్యాంకుల సమర్ధత పెరగాలని వైఎస్ జగన్ పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలు పెంచాలని పేర్కొన్నారు. ప్రభుత్వ స్కూళ్లకు పిల్లలు తిరిగి వస్తున్నట్టు తెలిపారు. చికిత్సకోసం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినట్టు సీఎం తెలిపారు.…
ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 6770 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1809844 కు చేరింది. ఇందులో 1712267 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 85,637 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 58 మంది…