ఓవైపు సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే.. మరోవైపు ప్రజలకు మౌలికసదుపాయాల కల్పనపై ఫోకస్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అందులో భాగంగా.. 2024 నాటికి రాష్ట్రంలోని ప్రతీ ఇంటికీ మంచినీటి కుళాయి ఏర్పాటుచేస్తామని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఇవాళ ఆర్‌డబ్ల్యూఎస్ టెక్నికల్ హ్యాండ్‌బుక్‌ను ఆవిష్కరించిన మంత్రి పెద్దిరెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని జగనన్న కాలనీల్లో నిర్మాణ పనులకు ఆర్‌డబ్ల్యుఎస్ ద్వారా నీటి వసతి కల్పిస్తామన్నారు.. 2024 నాటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు.. జల్‌జీవన్ మిషన్ ద్వారా ఈ ఏడాది రూ.7251 కోట్లతో పనులు చేపడుతున్నట్టు వెల్లడించిన మంత్రి పెద్దిరెడ్డి.. వాటర్ గ్రిడ్‌తో మంచినీటి సమస్యకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టనున్నట్టు వెల్లడించారు.