జులై 26 నుంచి టెన్త్ పరీక్షలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోవిడ్ విజృంభణతో చాలా రాష్ట్రాలు టెన్త్ పరీక్షలు రద్దు చేశాయి.. పరీక్షల ఫీజులు చెల్లించిన అందరు విద్యార్థులు పాస్ అయినట్టు ప్రకటించాయి.. వాళ్లకు ఇరత పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్‌లు కూడా కేటాయించారు. అయితే, ఏపీ మాత్రం.. పరీక్షలు వాయిదా వేసింది.. విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది.. ఇక, పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని.. జులై 26 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించడానికి ప్రతిపాదనలు రెడీ చేసినట్టు తెలిపారు ఏపీ పాఠశాల విద్యా శాఖ కమీషనర్ చినవీరభద్రుడు.. పదవ తరగతి పరీక్షలకి 6.28 లక్షల మంది విద్యార్ధుల హాజరుకానున్నారని తెలిపిన ఆయన.. 4 వేల సెంటర్లలో పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని.. పరీక్షల నిర్వహణలో 80 వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బంధి పాల్గొంటారని వెల్లడించారు.
మరోవైపు.. 11 పేపర్ల బదులు ఏడు పేపర్లకి పరీక్షలు నిర్వహించాలని సూచిస్తున్నామన్న ఆయన.. సెప్డెంబర్ 2 లోపు పరీక్షా ఫలితాలు కూడా వెల్లడించేలా ఏర్పాట్లుచేస్తున్నట్టు తెలిపారు.. గత ఏడాది కరోనా కారణంగా పరీక్షలు రద్దు చేయాల్సి వచ్చిందని.. ఈ ఏడాది సెకండ్ వేవ్ కారణంగా పరీక్షలు వాయిదా వేయాల్సి వచ్చిందని.. కానీ, పరీక్షలు నిర్వహించకపోతే విద్యార్ధులకి నష్టం కలుగుతుందన్నారు చినవీరభద్రుడు. కోవిడ్ నిబంధనలు అనుసరించి పరీక్షలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని.. రేపు సిఎం వైఎస్ జగన్.. విద్యా శాఖపై సమీక్షలో పరీక్షల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.
Also Read
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
తాజావార్తలు
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!