కరోనా సమయంలో కనీసం ప్రజలకు అందుబాటులో ఉండని తెలుగుదేశం పార్టీ, బీజేపీ నేతలు.. హైదరాబాద్‌లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టడం హాస్యాస్పదం.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం విడ్డూరం అని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. మరోవైపు.. నారా లోకేష్‌పై సెటైర్లు వేశారు రోజా.. తనలాగే రాష్ట్రంలోని విద్యార్థి, విద్యార్థులు దద్దమ్మల, చవటల తయారవ్వాలననే దురాలోచనతో పరీక్షలు రద్దు చేయాలని లోకేష్ డిమాండ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు… ప్రజలకి వాక్సిన్ అందరికీ అందకపోవడానికి కేవలం నరేంద్ర మోడీ ప్రభుత్వమే కారణమని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే.. రాష్ట్రానికి సరిపోయే వ్యాక్సిన్ అందించాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఒక్క లేఖ అయినా.. కేంద్రానికి గానీ, ప్రధాని మోడీకి గానీ ఎందుకు రాయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.