అమరావతి : అసైన్మెంట్ కమిటీల ఏర్పాటు, రీ-సర్వే, ఇళ్ల పట్టాల పంపిణీలో సమస్యల పరిష్కారంపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో డెప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్, సీఎం ముఖ్య సలహాదారు సజ్జల భేటీ అయ్యారు. అంతేకాదు… ప్రభుత్వ చీఫ్ విప్, విప్ లు, ఎమ్మెల్యేల నుంచి సమావేశంలో అభిప్రయాలు, సూచనలు తీసుకున్నారు ధర్మాన, సజ్జల. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో అసైన్మెంట్ కమిటీలు పునరుద్దరించే అంశంపై కీలక సమీక్ష నిర్వహించారు. వైఎస్ హయాంలో ఉన్న విధంగా నియోజకవర్గ స్థాయిలో అసైన్మెంట్ కమిటీల ఏర్పాటు చేయాలని పలువురు ఎమ్మెల్యేల సూచనలు చేశారు.
read also : పీసీసీపై సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు..
గత ప్రభుత్వ హయాంలో రైతులకు ఒక్క సెంటు సాగు భూమి కూడా ఇవ్వలేదని అభిప్రాయపడ్డారు పలువురు ఎమ్మెల్యేలు. వైఎస్ హయాంలో మాగాణి భూములు రెండున్నర ఎకరాలు, మెట్ట భూములు ఐదెకరాల మేర పంపిణీ చేశారని తెలిపారు డెప్యూటీ సీఎం. నియోజకవర్గ స్థాయిలో అసైన్మెంట్ కమిటీలను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వ నిర్ణయం తీసుకోనుంది. రేపటి కేబినెట్ లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి అసైన్మెంట్ కమిటీల ఏర్పాటుపై చర్చ జరిగే అవకాశం ఉంది.