అమరావతి : ఏపీలో సేంద్రియ వ్యవసాయ పాలసీ పై కసరత్తు చేస్తోంది జగన్ సర్కార్. ఈ నేపథ్యంలోనే ఆర్గానిక్ ఫార్మింగ్ కమిటీతో సమావేశమయ్యారు మంత్రి కన్నబాబు. ఇందులో భాగంగానే బయో ఫెర్టిలైజర్స్ , పెస్టిసైడ్స్, ఇతర రసాయనాల వినియోగంపై మంత్రి, కమిటీ సభ్యుల చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ… త్వరలోనే ఆర్గానిక్ పాలసీని తీసుకొస్తామని.. సంబధిత శాఖల సూచనలు, అభిప్రాయాలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లి విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. సేంద్రియ వ్యవసాయ పద్దతులపై విస్తృతంగా రైతుల్లో అవగాహనా పెంచాలని ఆదేశాలు జారీ చేశారు మంత్రి కన్నబాబు. కొత్త పంటల సాగు ప్రారంభం నుంచే రైతులను సేంద్రియ వ్యవసాయ విధానంపై ప్రోత్సాహించాలని కమిటీ సభ్యులు తమ అభిప్రాయాన్ని మంత్రి కన్నబాబుకు వివరించారు.