ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టుగా.. ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య వచ్చిన ఇగో క్లాష్.. మరో ఇద్దరు డిప్యూటీ సీఎంలను కంగారెత్తించింది. అధికారులు.. ప్రభుత్వ వర్గాల్లోనూ పెద్దచర్చగా మారింది. సమస్యకు విరుగుడు మంత్రం వేసినా.. తెర వెనక జరిగిన కథ మాత్రం ఏపీ సచివాలయంలో ఆసక్తి రేకెత్తించింది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. కీలక విభాగాలను తప్పించడంతో డిప్యూటీ సీఎంలు కలవరం! రెవెన్యూ శాఖలో అంతర్భాగంగా ఉండే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు.. వాణిజ్య పన్నుల విభాగాలను ఆర్థికశాఖకు బదలాయిస్తూ…
తూర్పుగోదావరి జిల్లాలో డెంగ్యూ జరాలు భయపెడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా కేసులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే అధికారికంగా 36 కేసులు నమోదయ్యాయి. క్షేత్రస్థాయిలో ప్రైవేటు హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న వారితో ఈ సంఖ్యకు ఐదింతలు అధికంగా ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. రాజమండ్రి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో డెంగ్యూ నిర్ధారణకు ఎలీషా పరీక్షలు నిర్వహిస్తున్నారు. జ్వరంతో బాధపడుతూ వస్తున్న వారందరికీ ఎలీషా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాయిస్… గత ఐదేళ్ల నుంచే తూ.గోదావరి జిల్లాలో డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. 2017లో…
తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో పాటు రుతుపవనాలు చురుగ్గా సాగుతుండటంతో జోరుగా వానలు పడుతున్నాయి. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది వాతావరణశాఖ. దీని ప్రభావంతో మరో మూడు రోజులు వర్షాలు దంచికొట్టే ఛాన్స్ ఉంది. అలాగే అతిభారీ వర్షాలతో కొన్ని జిల్లాలు అతలాకుతలం అయ్యే అవకాశాలున్నాయని చెప్పింది ఐఎండీ. read also : జులై 13, మంగళవారం దినఫలాలు దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాగాలు సిద్ధంగా…
కరోనా ఎంతో మంది ప్రాణాలు తీసింది.. కొన్ని కుటుంబాలనే పొట్టనపెట్టుకుంది.. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులు ఎందరో.. అయితే, కరోనా మహమ్మారి ఇద్దరు ప్రేమికులను కూడా బలితీసుకుంది… ప్రియురాలు కరోనాబారినపడి కన్నుమూస్తే.. ప్రియుడు ఆ విషయాన్ని జీర్ణించుకోలేపోయాడు.. ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విశాఖలో జరిగింది. గుంటూరులో కరోనాతో ప్రియురాలు మృతిచెందితే.. విశాఖలోని గాజువాక కణితి రోడ్డులోని ఓ రూమ్‌లో బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు యువకుడు.
ఏపీలో దాదాపు అన్ని జిల్లాలో కరోనా కేసులు తగ్గాయి. కాని తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం కేసులు అదుపులోకి రావడం లేదు. దీంతో కారణాలపై ప్రభుత్వం ఆరా తీస్తుండడంతో అధికారులు ఇప్పుడు పరుగులు తీస్తున్నారు. గడచిన కొన్ని వారాలుగా పాజిటివ్ జిల్లా తొలి స్థానంలో కొనసాగుతుండడంతో ఎందుకిలా అనే దానిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. గడిచిన ఇరవై రోజుల్లో జిల్లాలో 10,944 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కర్ఫ్యూ వేళలు పొడిగించారు. చింతూరు, పి.గన్నవరం మండలాల్లో మధ్యాహ్నం రెండు నుంచి…
టిటిడి పాలకమండలి నియామకం ఎందుకు ఆలస్యమైంది? దాని వెనుక ఏదైనా కారణం ఉందా? చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి ప్రమాణస్వీకారం చేస్తారని ప్రచారం జరిగినా, ఎందుకు బ్రేక్ పడింది. కార్పొరేషన్ ల ప్రకటన రోజే…. టిటిడి అంశం కూడా తేలిపోతుందని భావించినా, అంచనాలు ఎందుకు తప్పాయి. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నియామకం ఇవాళో రేపో అంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు చక్కర్లు కొడుతూ ఉంటే… ప్రభుత్వం మాత్రం పాలకమండలి నియామక ప్రకటన నిదానంగానే చేసే అవకాశం…
కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలను క్రమంగా అమలు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… వరసగా రెండో ఏడాది వైఎస్సార్ కాపు నేస్తం నిధులు జమ చేసేందుకు సిద్ధం అయ్యింది.. రేపు సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్మును జమ చేయనున్నారు.. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో సొమ్మును జమ చేయనున్నారు సీఎం జగన్.. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన…
కేంద్ర ప్రభుత్వం గెజిట్లు విడుదల చేసినా.. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి… జల జగడంపై స్పందించిన ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి… చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే నీటి కేటాయింపులు జరిగేవన్న ఆయన.. తెలుగు రాష్ట్రాల్లో సాగు నీటి ప్రాజక్టులపై మాట్లాడే నైతిక హక్కు ఏ పార్టీకి లేదన్నారు.. బ్రిజేష్ ట్రిబ్యునల్ అనేక సార్లు నీటిని కేటాయిస్తామన్నా ప్రాజక్టులను పూర్తి చేసిన పాపాన…
నిన్న మొన్నటిదాకా అంటీ ముట్టనట్టున్నాడు. ఇప్పుడు జస్ట్.. చిన్న పిలుపురాగానే అటెండెన్స్ వేయించుకున్నాడట. ఓ దశలో కండువా మార్చేస్తారనే టాక్ కూడా నడిచింది. అంతలోనే ఊహించనంత మార్పు.. దీంతో ఆ మాజీ మంత్రిపై నియోజకవర్గంలో రకరకాల ఊహాగాహానాలు చక్కర్లు కొడుతున్నాయట. రాజకీయాలు అనూహ్యంగా మారిపోతుంటాయి. ఏ నాయకుడు ఎప్పుడు ఏ కండువా కప్పుకుంటాడో.. ఊహించలేని పరిస్థితి. కొందరిపై ఏళ్ల తరబడి ఊహాగానాలు వినిపిస్తూనే ఉంటాయి. కానీ, పార్టీ మారరు. వేరే జెండా ఎత్తరు. ఉన్న పార్టీలోనే ఎత్తు…
ఏపీలో కరోనా కేసులు సంఖ్య రోజు రోజుకు తగ్గుతూ వస్తోంది. తాజాగా ఏపీ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 86,280 సాంపిల్స్ పరీక్షించగా.. 2,527 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 19 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 2,412 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,46,749 కి పెరగగా.. కోలుకున్నవారి సంఖ్య 19,09,613 కి చేరింది..…