Minister Nara Lokesh: మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనమిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళికలతో వెళుతున్నట్లు తెలిపారు. వర్టికల్, హారిజాంటల్ అభివృద్ధి క్లస్టర్ విధానంలో కీలకం అని అన్నారు. ఉత్తరాంధ్రకు యూనివర్సిటీలు తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారని అన్నారు. ప్రభుత్వం నుంచి భూములు తీసుకున్న సంస్థలు బిల్డింగ్ ప్లాన్ వచ్చినప్పటి నుంచి 11 నెలల 29 రోజుల్లో కార్యకలాపాలు ప్రారంభించకపోతే భూములను వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు.
READ ALSO: Off The Record: ప్రధాని చెప్పినా ఎంపీల్లో ఒకరు లీక్ చేశారా?.. అనుమానపు చూపులు ఎటువైపు?
యూనివర్సిటీల ప్రక్షాళన చేస్తున్నామని, నియామకాల్లో ఉన్న న్యాయపరమైన ఇబ్బందులను అధిగమించి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళికలు, మౌలిక వసతుల కల్పన, కాలుష్య నిర్వహణపై సమగ్రంగా దృష్టి సారించామని అన్నారు. అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఏవియేషన్‌ను రెండుగా విభజించి రాయలసీమ, ఉత్తరాంధ్రలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతీ ఫ్లైట్‌కి 20 మంది వరకు పైలెట్లు అవసరం అని, వాళ్లకు గ్లోబల్ స్టాండర్డ్స్‌తో శిక్షణ కావాలని చెప్పారు. భవిష్యత్‌లో 20 నుంచి 30 వేల మంది పైలెట్ల అవసరం ఉంటుందని చెప్పారు. ఆ దిశగా భోగాపురం ఏర్పాటు జరగనుందని పేర్కొన్నారు.