తూర్పుగోదావరి జిల్లాలో డెంగ్యూ జరాలు భయపెడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా కేసులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే అధికారికంగా 36 కేసులు నమోదయ్యాయి. క్షేత్రస్థాయిలో ప్రైవేటు హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న వారితో ఈ సంఖ్యకు ఐదింతలు అధికంగా ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. రాజమండ్రి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో డెంగ్యూ నిర్ధారణకు ఎలీషా పరీక్షలు నిర్వహిస్తున్నారు. జ్వరంతో బాధపడుతూ వస్తున్న వారందరికీ ఎలీషా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
వాయిస్… గత ఐదేళ్ల నుంచే తూ.గోదావరి జిల్లాలో డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. 2017లో 336 కేసులు నమోదు కాగా, 2018లో 170, 2019లో 545 కేసులు నమోదయ్యాయి. 2020లో 575 కేసులు వెలుగుచూశాయి. 2021లో ఇప్పటి వరకూ 36 కేసులు నమోదైనట్లు అధికారులు తేల్చారు. కేవలం 2 నెలల్లో వందల సంఖ్యలో డెంగ్యూ కేసులు నమోదవుతున్నా.. అధికారులు సక్రమంగా స్పందించడంలేదనే విమర్శలు వస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని 11 మండలాల పరిధిలో ఏటా డెంగ్యూ, మలేరియా కేసులు నమోదువుతున్న గుర్తించారు అధికారులు. ఇళ్లలోని గోడలకు దోమల నివారణ మాత్రమే పిచికారీ చేశారు. రెండో దశ చేయాల్సి ఉంది. కేసులు ఎక్కువగా నమోదైన 20 గ్రామాలు, 10 పట్టణాలను గుర్తించారు. అయితే బ్లాక్ స్పాట్స్ ప్రాంతాల్లోని కుటుంబాలకు 3లక్షల 79వేల 300 రూపాయల ఖర్చుతో దోమతెరలను అందజేశారు అధికారులు. జిల్లాలో డెంగ్యూ కేసులు పెరుగుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఎఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు డెంగ్యూపై అవగాహన కల్పిస్తున్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఏజెన్సీ ప్రాంతాలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. ఈ సీజన్లో డెంగ్యూ వ్యాధికి కారకమైన టైగర్ దోమల సంఖ్య కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. దీనిపై ప్రజలను అప్రమత్తం చేయాల్సి ఉంది. ఆగస్ట్ 1వ తేదీ నుంచి 11తేదీ వరకు డెంగ్యూ మాసోత్సవాల పేరుతో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు.