వెర్సటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల : ఎ మిస్టికల్ వరల్డ్’ ఇప్పటికే బలమైన బజ్ క్రియేట్ చేస్తోంది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి యగంధర్ ముని దర్శకత్వం వహించారు. అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా బిజినెస్ ఇప్పటికే పూర్తవగా, క్రేజ్‌కు తగ్గట్టే ఫ్యాన్సీ రేట్లకు డీల్స్ క్లోజ్ అయ్యాయి.
Also Read : Mahesh Babu : ‘వారణాసి’తో వరల్డ్ రికార్డుల వేట.. మహేష్ – జక్కన్న మాస్టర్ ప్లాన్ చూశారా!
‘శంబాల’ నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, మేకింగ్ వీడియోలు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ కంటెంట్ ట్రెండ్ అవ్వడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ట్రేడ్ వర్గాల్లో ఇప్పటికే డిసెంబర్ 25న విడుదలకానున్న ‘శంబాల’ బ్లాక్‌బస్టర్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ నమ్మకానికి తగ్గట్టుగానే టాప్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు రంగంలోకి దిగాయి. సమాచారం ప్రకారం నైజాం ఏరియాలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్, ఏపీ & సీడెడ్ ప్రాంతాల్లో ఉషా పిక్చర్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నాయి. ఓవర్సీస్ హక్కులను మూన్ షైన్ సినిమాస్ దక్కించుకోగా, కర్ణాటకలో కుమార్ బెంగళూర్ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఇదిలా ఉండగా, ఓటీటీ హక్కుల కోసం పోటీ పడిన ఆహా ప్లాట్‌ఫామ్ డీల్ క్లోజ్ చేయగా, శాటిలైట్ హక్కులను జీ నెట్‌వర్క్ సొంతం చేసుకుంది. సినిమా రిలీజ్‌కు ముందే నిర్మాతలు టేబుల్ ప్రాఫిట్స్‌లో ఉండటం విశేషం.
భారీ బడ్జెట్‌తో ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించిన ‘శంబాల’ను విజువల్ వండర్‌గా మలిచారు మేకర్స్. ప్రవీణ్ కె బంగారి అందించిన అద్భుతమైన సినిమాటోగ్రఫీ, శ్రీచరణ్ పాకాల పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయి. పాన్ ఇండియన్ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించేలా రూపొందిన ఈ మిస్టికల్ థ్రిల్లర్‌ను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.