Dance Reels at Srisailam Temple: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలానికి దర్శనార్థం వచ్చిన ఓ యువతి చేసిన రీల్స్ ఇప్పుడు తీవ్ర వివాదానికి దారి తీస్తున్నాయి. శ్రీశైలంలోని సీఆర్‌ఓ (CRO) కార్యాలయం సమీపంలో, నిత్యం భక్తులు సంచరించే ప్రధాన రహదారిపై సినిమా పాటలు, ప్రైవేట్స్ సాంగ్స్‌కు డ్యాన్స్ చేస్తూ రీల్స్ తీసిన యువతి వాటిని తన ఇన్‌స్టాగ్రామ్ ఐడీలో షేర్ చేయడంతో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పవిత్ర క్షేత్ర పరిధిలో ఇలాంటి రీల్స్ చేయడమేంటని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివుడి దర్శనానికి వచ్చే భక్తులు తిరిగే ప్రదేశాల్లో సినిమా పాటలకు డ్యాన్స్‌లు చేయడం పుణ్యక్షేత్ర గౌరవాన్ని దెబ్బతీసే చర్యగా వారు అభిప్రాయపడుతున్నారు.
Read Also: Excess Luggage Rules: రైళ్లలో ఎక్కువ లగేజీ తీసుకెళ్తున్నారా.. మీకు ఇది బ్యాడ్ న్యూసే..
ఈ ఘటనపై పలువురు భక్తులు, స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, రీల్స్ చేసిన యువతిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తిరుమల తరహాలో శ్రీశైలంలో కూడా రీల్స్, వీడియోలపై కఠిన నిబంధనలు అమలు చేయాలని కోరుతున్నారు. ఈ అంశంపై శ్రీశైలం ఆలయ చైర్మన్, ఈవో స్పందించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని భక్తులు, స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. పవిత్ర క్షేత్రాల గౌరవాన్ని కాపాడేందుకు కఠిన చర్యలు తప్పనిసరి అని వారు స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా.. యువతి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి..