శ్రీశైలానికి భారీ వరద.. 10 గేట్లు ఎత్తివేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీశైలం జలాశయానికి భారీ వరద కొనసాగుతూనే ఉంది.. ఇన్ఫ్లో రూపంలో 4,60,154 క్యూసెక్కుల నీరు వచ్చి జలాశయంలో చేరుతుండగా… 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. మొత్తంగా 3.40 లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యామ్ నుంచి దిగువకు వెళ్తోంది… ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884.40 అడుగులుగా ఉంది.. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం డ్యామ్లో 212.4385 టీఎంసీల నీరు ఉంది.. కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇక, శ్రీశైలం డ్యామ్ నుంచి నాగార్జునసాగర్ వైపు పరుగులు పెడుతోంది కృష్ణమ్మ. మరోవైపు.. శ్రీశైలం డ్యామ్ గేట్లు తెరిచినప్పుడు అక్కడి దృశ్యాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.. దీంతో.. పర్యాటకులు శ్రీశైలానికి క్యూ కడుతున్నారు.
Also Read
తాజావార్తలు
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
INDIA Bloc: సీఈసీకి వ్యతిరేకంగా నేడు చెన్నైలో విపక్ష కూటమి నిరసన.. పాల్గొననున్న టీవీకే
-
మళ్లీ తెరపైకి Ankita Bhandari Case.. ఢిల్లీలో అంకిత తల్లిదండ్రుల నిరసన.. రాహుల్ గాంధీ మద్దతు..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..