ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 78,992 శాంపిల్స్ పరీక్షించగా… 2,058 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 23 మంది కరోనాబారినపడి మృతిచెందారు.. ఇదే సమయంలో 2,053 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు.. తాజాగా చిత్తూరులో ఐదుగురు, కృష్ణా జిల్లాలో నలుగురు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు చొప్పున, తూర్పు గోదావరి, గుంటూరు, కర్నూల్‌లో ఇద్దరు చొప్పున, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు మృతిచెందారు. మొత్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 19,66,175కు.. రికవరీ కేసులు 19,31,618కు పెరిగాయి.. ఇక, కరోనాబారినపడి ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 13,377గా ఉండగా.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 21,180 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్ పరీక్షల సంఖ్య 2,45,63,043కు చేరిందని బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.