Andhra Pradesh: ఐదు జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులను ఇంఛార్జ్‌లుగా నియమించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ప్రభుత్వ లక్ష్యాల అమలుపై దృష్టి పెట్టిన సర్కార్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఐదు జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులను ఇంఛార్జ్‌లుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాల స్థాయిలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను వేగంగా, సమర్థవంతంగా అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ నియామకాలు చేపట్టినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Read Also: Karnataka: కర్ణాటక తీరంలో చైనీస్ సీగల్ కలకలం.. భద్రతపై అనుమానాలు
వివరాలు
* తూర్పు గోదావరి జిల్లా ఇంఛార్జ్‌గా జి. వీరపాండియన్
* కాకినాడ జిల్లా ఇంఛార్జ్‌గా ప్రసన్న వెంకటేష్
* బాపట్ల జిల్లా ఇంఛార్జ్‌గా మల్లికార్జున్
* శ్రీ సత్యసాయి జిల్లా ఇంఛార్జ్‌గా గంధం చంద్రుడు
* నంద్యాల జిల్లా ఇంఛార్జ్‌గా సీహెచ్ శ్రీధర్ నియామకం..
అయితే, ఆ జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, శాఖల మధ్య సమన్వయం, ప్రజాసేవల పనితీరు మెరుగుపడేలా ఈ సీనియర్ ఐఏఎస్ అధికారులు పర్యవేక్షణ చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. అలాగే ప్రభుత్వం నిర్దేశించిన విధానాలు, లక్ష్యాలను కచ్చితంగా అమలు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ నియామకాలతో జిల్లాల పాలన మరింత సమర్థవంతంగా మారుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.