అఖిలప్రియ ఇంట్లో చోరీ..! పోలీసులపై పీఎస్‌లో ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ.. పోలీసులపై పోలీస్ స్టేషన్‌లోనే ఫిర్యాదు చేశారు.. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని తన ఇంట్లోని పలు విలువైన పత్రాలతో పాటు కొన్ని వస్తువులని ఎత్తుకెళ్లారని ఆరోపిస్తున్న ఆమె… దీనిపై కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.. భూమి పత్రాలతో పాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారని.. ఇది బోయిన్‌పల్లి పోలీసుల పనేనని ఆరోపిస్తున్న అఖిలప్రియ.. ఈ ఘటనపై కూకట్‌పల్లి పీఎస్‌లో ఫిర్యాదు ఇచ్చారు..
తాను ఇంట్లో లేని సమయంలో కొంతమంది వ్యక్తులు తన ఇంటికి వచ్చారని ఫిర్యాదులో పేర్కొన్న భూమా అఖిలప్రియ.. బోయిన్‌పల్లి పోలీసులతో పాటు పది మంది తన ఇంట్లోకి చొరబడ్డారని.. అత్యంత విలువైన పత్రాలతో పాటు తన తండ్రికి సంబంధించిన కొన్ని వస్తువులను ఎత్తుకుపోయారని తెలిపారు. ఇక, దీనికి సంబంధించిన కొన్ని సీసీ టీవీ ఫుటేజ్, ఫోటోలతో పాటు కొన్ని వీడియోలను కూడా ఆమె జతపరిచారు. తన ఇంట్లోకి అక్రమంగా చొరబడి పత్రాలు ఎత్తుకెళ్లారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, హైదరాబాద్‌లోని ఓ ల్యాండ్ వ్యవహారంలో కిడ్నాప్ కేసు నమోదు కావడం.. ఆ కేసులో బోయిన్‌పల్లి పోలీసులు భూమా అఖిలప్రియను అరెస్ట్ కూడా చేసిన సంగతి తెలిసిందే.
Also Read
తాజావార్తలు
-
Buchi Babu Sana : బుచ్చి.. నెక్ట్స్ సినిమా ఎప్పుడు బాబు.. ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరు?
-
Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
Bajaj Pulsar: 25 ఏళ్లలో బజాజ్ పల్సర్ ఎంతగా మారింది? 2001 నాటి 150cc నుంచి కొత్త N160 4V వరకు పూర్తి చరిత్ర ఇదే!
-
DC: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’లో విజయ్ దేవరకొండను తీసుకోవాలనుకున్నారా? అసలు కథ ఇదే!
-
YouTube Movies : రూపాయి ఖర్చు లేకుండా.. యూట్యూబ్‌లో మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్స్
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!