ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం దృష్టి సారిందించి. 2014 నుంచి ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. తెలంగాణ ఏర్పాటు తరువాత కాంగ్రెస్ పార్టీపై ఏపీ ప్రజలు కోపంగా ఉన్నారు. ఆ కోపాన్ని ఎన్నికల్లో చూపించారు. అయితే, ఈ సంఘటనలు జరిగి ఏడేళ్లు గడిచింది. అయినప్పటికీ ఏపీలో పార్టీ ఇంకా కోలుకోలేకపోతున్నది. పార్టీని తిరిగి బలోపేతం చేసి తిరిగి గాడిలోకి తీసుకొస్తే ఎప్పటికైనా ఏపీలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అన్నది ఆ పార్టీ వాదన. అందుకోసమే పార్టీని బలోపేతం చేసేందుకు సుమాలోచనలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు రాహుల్ గాంధీ అధ్యక్షతన సీనియర్ నేతలతో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో ఏపీ కాంగ్రెస్ పై పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. పీసీసీ అధ్యక్షుడిని మారుస్తారనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ పీసీసీ అధ్యక్షుడి మార్పు ఉంటే ఎవరికి ఇస్తారు అన్నది ఈ సమావేశం తరువాత క్లారిటీ వస్తుంది.
Read: ఆ పావురాల పేరుమీద కోట్ల రూపాయల ఆస్తులు… ఎక్కడో తెలుసా…!!