ప్రముఖ బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్..గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విభిన్న సినిమాలు తీస్తూ.. బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు హీరో అమీర్ ఖాన్. అయితే.. ఈ బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తాజాగా ఏపీలో పర్యటించారు. షూటింగ్ నిమిత్తం కాకినాడకు విచ్చేశారు హీరో అమీర్ ఖాన్. “లాల్ సింగ్ చద్ద” అనే సినిమా షూటింగ్ నిమిత్తం అమీర్ ఖాన్ కాకినాడ వచ్చారు. ఈ నేపథ్యంలోనే కాకినాడ చేరుకున్న అమీర్ ఖాన్ కాసరోవర్ హోటల్ లో బస చేశారు. ఇక ఈ సందర్భంగా అమీర్ ఖాన్ ను చూసి… ఫోటోల కోసం అభిమానులు ఎగబడ్డారు. ఇక నేడు కోనసీమలోని అల్లవరం, ఓడలరేవు ప్రాంతాల్లో షూటింగ్ లో పాల్గొననున్నారు అమీర్ ఖాన్. ఈ సినిమా షూటింగ్ 15 రోజుల పాటు ఉండనున్నట్లు సమాచారం అందుతోంది.