ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా బోగస్ చలనాలా స్కామ్ వెలుగు చూసింది.. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో భాగంగా ప్రభుత్వానికి చెల్లించే ఫీజు విషయంలో జరిగిన బోగస్ చలనాల కుంభకోణాన్ని సీరియస్‌గా తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇప్పటికే ఈ వ్యవమారంపై ఆరా తీశారు సీఎం వైఎస్ జగన్.. మరోవైపు.. ఈస్కామ్‌తో డాక్యుమెంట్ రైటర్లపై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం.. డాక్యుమెంట్ రైటర్లకు లైసెన్సింగ్ విధానాన్ని తెచ్చే అంశంపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ సమాలోచనలు చేస్తోంది.. బోగస్ చలానా స్కామ్‌లో డాక్యుమెంట్ రైటర్లదే కీలక పాత్ర కావడంతో.. ఈ విధానంలో అవకతవకలకు అవకాశం లేకుండా.. ప్రభుత్వ నిబంధనలను అనుగుణంగా పనిచేసేలా లైసెన్సింగ్ విధానంపై దృష్టి సారించారు అధికారులు. 25 ఏళ్ల క్రితం డాక్యుమెంట్ రైటర్ల లైసెన్సింగ్ విధానాన్ని తిరిగి అమలు చేద్దామంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.. ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే వారికే డాక్యుమెంట్ రైటర్ల లైసెన్స్ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు అధికారులు.