ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం జగన్ ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయం ఓ ఎత్తు అయితే.. జీవోలను ఆన్‌లైన్‌లో పెట్టకూడదంటూ తీసుకున్న నిర్ణయం మరో ఎత్తుగా కనిపిస్తోంది. GOIR వెబ్ సైట్ ద్వారా ప్రభుత్వ ఉత్తర్వులను ఆన్‌లైన్లో అందుబాటులో ఉంచే ప్రక్రియ 2008 నుంచి ప్రారంభమైంది. ఈ ఆనవాయితీని జగన్ సర్కార్ పక్కకు పెట్టింది. ఈ విధానానికి స్వస్తి పలకాలంటూ అన్ని శాఖల కార్యదర్శలకు మెమో పంపింది. ప్రభుత్వ బిజినెస్ రూల్స్ ప్రకారం జీవోలను పబ్లిక్ డొమైనులో పెట్టకూడదని డిసైడ్ అయినట్టు స్పష్టం చేసింది ఏపీ సర్కార్. ప్రభుత్వం ఇంత సడెన్‌గా ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనే అంశంపై వివిధ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
Also Read
- New Excise Policy: 2026-27 ఎక్సైజ్ పాలసీ.. ఏడాది పాటు లైసెన్సులు రెన్యువల్..
- AP Employees: ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.
- Amaravati: అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపు.. ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేసిన అధికారులు..
- Andhra Pradesh: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్.. మంత్రి కీలక వ్యాఖ్యలు..
ఇటీవల కాలంలో జరిగిన కొన్ని పరిణామాలతో ప్రభుత్వం ఈ తరహా నిర్ణయం తీసుకుందనే భావన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా APSDC విషయంలో ప్రభుత్వం చాలా విమర్శలు ఎదుర్కొంది. ఆర్థికపరమైన విషయాల్లోనూ తీవ్ర విమర్శలకు గురైంది. అలాగే కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ జీవో విడుదల చేసిన వెంటనే దాన్ని బేస్ చేసుకుని వెంటనే కోర్టుకు వెళ్తోన్న సంఘటనలూ ఎక్కువ అయ్యాయని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ తలనొప్పులు లేకుండా ఉండాలంటే అసలు కీలక ఉత్తర్వులు పబ్లిక్ డొమైనులో పెట్టకుండా ఉంటే బెటరేమోననే ప్రతిపాదనకు మొగ్గు చూపినట్టు సమాచారం. అయితే ప్రభుత్వ బిజినెస్ రూల్స్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంటే.. ఇప్పటి వరకు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారా..? అని సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే బ్లాంక్ జీవోల విషయంలో పెద్ద రాజకీయ దుమారం రేగుతున్న సమయంలో.. జీవోలను పబ్లిక్ డొమైనులో పెట్టకూడదన్న నిర్ణయం ఇంకెంత రచ్చకు దారి తీస్తుందో చూడాలి..
- Tags
- Andhra Pradesh
- APSDC
- cm jagan
తాజావార్తలు
-
Devasish Sharma: IAS పదవికి రాజీనామా.. 8 రోజుల్లోనే బీజేపీ ఎంపీ టికెట్.. దేవాశిష్ శర్మ ఎవరు?
-
Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వెళ్తున్నారా? ఈ ట్రాఫిక్ రూట్లు మర్చిపోకండి
-
Sergio Gor: మణిపూర్‌లో సెర్గియో గోర్ పర్యటన.. గవర్నర్, సీఎంతో భేటీ!
-
Rain Alert: బ్రిక్స్ సదస్సు వేళ ఢిల్లీకి భారీ వర్ష సూచన
-
Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?