ఏపీలో 11 మంది డెప్యూటీ కలెక్టర్ల బదిలీలు జరిగాయి. శ్రీశైలం ఈవోగా లవన్న నియమించబడటంతో జీఏడీకి రిపోర్ట్ చేయాల్సిందిగా శ్రీశైలం ఈవో కేఎస్ రామారావుకు ఆదేశాలు జారీ చేసారు. ఇక కోవూరు ఆర్డీఓగా ఏక మురళి, అమలాపురం ఆర్డీఓగా వసంత రాయుడు, ఏపీఎస్సీసీఎఫ్సీ కృష్ణా జిల్లా ఈడీగా చంద్ర లీల, గురజాల ఆర్డీఓగా పార్థసారధి, పులిచింతల స్పెషల్ కలెక్టర్ పీఏగా వసంత బాబు, కడప మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్గా రంగ స్వామి, నర్సిపట్నం ఆర్డీఓగా గోవింద రావు,…
ఏపీ గవర్నరును కలిశారు టీడీపీ నేతలు. జీవోలు పబ్లిక్ డొమైనులో పెట్టకూడదన్న ప్రభుత్వ నిర్ణయంపై గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందనుకు టీడీపీ ఫిర్యాదు చేసింది. అనంతరం టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ… జీవోలను ఆన్లైన్లో పెట్టకుండా తేదీ, జీవో నెంబర్ వేసి వదిలేస్తున్నారు. తెలంగాణ హైకోర్టు జీవోలు ఆన్లైన్లో పెట్టాలని ఆదేశాలిచ్చింది. రాత్రి పూట రహస్య జీవోలు విడుదల చేస్తున్నారు. ప్రభుత్వం జీవోలు ఆన్లైన్లో పెడుతుందా లేదా అనేది ఒక వారం రోజులు…
ఏపీలో కరోనా కేసులు పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం… ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 1,435 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,00,038 కి చేరింది. ఇందులో 19,70,864 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా, 15,472 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 6 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో…
ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా.. ఏదో జరుగుతోంది. రాష్ట్రం చుట్టూ కేంద్ర మంత్రులు చక్కర్లు కొడుతున్న తీరు చూస్తుంటే.. ఈ అనుమానం బలపడుతోంది. పైకి చెప్పే కారణాలు ఏవైనా సరే.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు. వరసపెట్టి మంత్రులంతా ఏపీ చుట్టే ఎందుకు తిరుగుతున్నారన్నది.. జనానికీ అయోమయాన్ని కలిగిస్తోంది. దక్షిణాదిన బలపడాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్న బీజేపీ ఆలోచనలు.. ఏపీ కేంద్రంగానే అమలు కాబోతున్నాయా అన్న చర్చ సైతం మొదలైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల.. జాతీయ…
ఉపరితల ఆవర్తనం నుండి ఒక ద్రోణి సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తు వరకు విదర్భ మీదుగా ఉత్తర కోస్తా తమిళనాడు మరియు తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు విస్తరించి ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంటుంది.భారీ వర్షాలు, విజయనగరం ,విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లాలలోఒకటిలేకరెండుచోట్ల కురిసే అవకాశం ఉంటుంది.రేపు…
అధికార పార్టీ ఎమ్మెల్యేలే అయినా.. ఏదో వెలితి. చూస్తుండగానే రెండున్నరేళ్లు పూర్తయిపోతోంది. ఇంకేదో పదవి వారిని ఊరిస్తూనే ఉంది. అవకాశాలు వస్తాయో లేదో.. పదవుల పంపకం ప్రస్తావనకు వస్తే మాత్రం ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఓ పదవిపై గురిపెట్టారట. వారెవరో.. ఆ పదవేంటో ఈ స్టోరీలో చూద్దాం. పదవుల కోసం నేతలు, ఎమ్మెల్యేలు పడిగాపులు! చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలుంటే.. 13 చోట్ల గెలిచింది వైసీపీ. వైసీపీ అధికారంలోకి వచ్చినా.. స్థానిక…
కరోనా మహమ్మారి కట్టడి కోసం విధించిన నైట్ కర్ఫ్యూను మరోసారి పొడిగించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… వచ్చే నెల నాలుగో తేదీ (సెప్టెంబర్ 4వ) వరకు నైట్ కర్ఫ్యూ కొనసాగిస్తున్నట్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.. ఏపీ సర్కార్ ఉత్తర్వుల ప్రకారం.. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలులో ఉండనుంది… ఆ తర్వాత యథావిథగా అన్ని కార్యక్రమాలకు అనుమతి ఉంటుంది.. అవి కూడా కరోనా నిబంధనలకు లోబడి చేసుకోవాల్సి…
నిన్నటి నుంచి ఏపీ టీడీపీ పార్టీలో ముసలం నెలకొన్న సంగతి తెలిసిందే. టీడీపీ నిర్వహణలోనే లోపాలున్నాయని, పార్టీలో ప్రస్తుతం నేను ఒంటరివాడిని అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. పార్టీకి రాజీనామాపై త్వరలోనే తన నిర్ణయం చెబుతానని కూడా అన్నారాయన. దీంతో పార్టీ వర్గాల్లో కలకలం రేగింది. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆయనతో మాట్లాడినట్టు తెలుస్తోంది. మరోవైపు… టీడీపీ సీనియర్ నేతలు చినరాజప్ప, జవహర్…
విజయవాడ : శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఇంద్రకీలాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం 5 గంటల నుండి క్యూలైన్లో వేచి ఉన్నారు భక్తులు. అటు వరలక్ష్మీ దేవి, లక్ష్మీ దేవి గా అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. దీంతో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు సంతోషంగా ఉందంటున్నారు. ఇక అమ్మవారి మూలవిరాట్ విగ్రహానికి వరలక్ష్మి దేవి అలంకరణ చేశారు ఆలయ సిబ్బంది. శ్రావణ మాసం మూడవ శుక్రవారం అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నారు. ఇక…
గుంటూరు : తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కు దేవాదాయశాఖ నోటీసులు జారీ చేసింది. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్టు స్వభావం తెలపాలంటూ నోటీసులో పేర్కొంది దేవాదాయ శాఖ. ట్రస్టు వార్షిక ఆదాయం, వివరాలు సమర్పించాలని నోటీసులో తెలిపింది దేవాదాయశాఖ. ట్రస్టు డీడ్ , మేనేజింగ్ ట్రస్టీ, ట్రస్టు ఆస్తులు, ఇతర ట్రస్టుల వివరాలకు సంబంధించిన కాపీలు అందించాలని దేవాదాయ శాఖ పేర్కొన్నారు. FDRలు, ట్రస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ వివరాలు, గత…