ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు.. ఎప్పుడు నుంచి ఎలా కరోనా సోకుతుందో తెలియని పరిస్థితి ఉంది.. తాజాగా నెల్లూరు జిల్లాలోని కావలి రూరల్ పోలీస్ స్టేషన్ కరోనా కలకలం సృష్టించింది.. ఒకే పోలీస్ స్టేషన్‌లో ఏకంగా 9 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. కొందరిలో కరోనా లక్షణాలు కనిపించడంతో.. అనుమానంతో అందరికీ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.. అయితే, సీఐ, ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ సహా మొత్తం 9 మంది పోలీసు సిబ్బంది మహమ్మారి బారినపడినట్టు తేలింది.. ఇక, అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు.. ఆ పీఎస్‌కు సంబంధించిన అధికారులు, సిబ్బంది.. వారి కుటుంబసభ్యులందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేపనిలో పడిపోయారు..