చంద్రబాబు హయాంలో తెలుగుదేశం పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు మాత్రమే ప్రయోజనం చేసే ప్రయత్నం చేశారు.. కానీ, వైఎస్ జగన్ సర్కార్ హయాంలో పరిస్థితి మారిపోయిందన్నారు ఏపీ బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ 26 నెలల కాలంలో బీసీలు బ్యాక్వర్డ్ క్లాస్ స్థాయి నుంచి బ్యాక్ బోన్ క్లాస్ స్థాయికి ఎదిగారని అభివర్ణించారు. ఈ రెండేళ్ల కాలంలో సుమారుగా 69 వేల కోట్ల రూపాయల ప్రయోజనం బీసీలకు చేకూరిందన్న…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రం లో గత 24 గంటల్లో 47,972 శాంపిల్స్ పరీక్షించగా.. 1,002 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 12 మంది కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు. ఇక, ఒకేరోజు 1,508 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. రాష్ట్రంలో నేటి వరకు 2,61,39,934 శాంపిల్స్ పరీక్షించగా.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల…
10°N అక్షాంశము వెంబడి తూర్పు-పడమర ‘షీర్ జోన్’ 5.8 km ఎత్తు వద్ద కొనసాగుతున్నది. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈరోజు, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే…
ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లు ఇటీవలే తిరిగి ప్రారంభం అయ్యాయి. వారం రోజుల నుంచి చిన్నారులు స్కూళ్లకు వెళ్తున్నారు. ప్రైవేట్, కార్పోరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను నిర్మించడంతో అందులో చేర్పించేందుకు తల్లిదండ్రులు పోటీపడుతున్నారు. నాడునేడు కార్యక్రమంలో భాగంగా స్కూళ్లకు అధునాతనమైన సదుపాయాలు కల్పించింది ప్రభుత్వం. ఇక ఇదిలా ఉంటే, ఏపీలో కరోనా కేసులు ప్రతిరోజూ వెయ్యికిపైగా నమోదవుతున్నాయి. స్కూళ్లలోనూ కేసులు నమోదవుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఉన్న డీఆర్ఎం మున్సిపల్ స్కూళ్లో ప్రధానోపాధ్యాయుడు, ముగ్గురు…
బడ్జెట్ పద్దులపై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. పద్దుల నిర్వహణలో పొరపాట్లను సరిదిద్దుతోంది. బడ్జెట్ కేటాయింపుల వినియోగ లెక్కలను ఇవ్వాలని అన్ని శాఖలను ఆదేశించింది.బడ్జెట్ పద్దుల సరైన నిర్వాహాణకు చర్యలు ప్రారంభించింది ఆర్ధిక శాఖ. పద్దుల నిర్వహాణలో వివిధ శాఖల్లో జరుగుతోన్న పొరపాట్లను సరిదిద్దుతోంది. బడ్జెట్ కేటాయింపుల్లో ఎన్ని నిధులు వినియోగించారో చెప్పాలని ఆదేశించింది. అన్ని శాఖలకు మెమో జారీ చేసింది. కేటాయిపుల్లోని హెచ్చు తగ్గులు, ఆదా చేసిన లెక్కలకు సంబంధించిన వివరాలతో పాటు.. వాటికి వివరణ…
తిరుపతిలోని శ్రీకాళహస్తిలో వాలంటీర్ చందన ఆత్మహత్యకు పాల్పడింది.. రైలు నుంచి దూకి రెండేళ్ల కుమారుడితో పాటు ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటి నుంచి కనిపించకుండా పోయిన ఆమె రైలు పట్టాలపై విగతజీవిగా మారింది. తిరుపతి నుంచి నెల్లూరు మార్గంలో రైలు కింద పడి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. శ్రీకాళహస్తి రూరల్ మండలం అక్కుర్తి గ్రామం వద్ద రైలు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈఘటనకు సంబందించి సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.…
వివేకా హత్య కేసులో కీలక సమాచారం అందించినవారికి సీబీఐ రూ.5 లక్షలు నజరానా ప్రకటించడంపై సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యకేసులో ఆధారాలిస్తే పారితోషికం ఇస్తామనడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. వివేకాను చంపింది ఎవరో పులివెందుల ఎమ్మెల్యే, కడప ఎంపీలను అడిగితే చెబుతారని రామకృష్ణ పేర్కొన్నారు. ఏళ్లతరబడి విచారణ చేస్తున్న కేసు పూర్తికాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లా అంశాలపై…
ఆ శాఖ అధికారులు రోడ్డెక్కినా.. ఆఫీసులో కూర్చున్నా డబ్బే డబ్బు. ప్రభుత్వ ఖజానాకు ఆ శాఖద్వారా వచ్చే ఆదాయం కంటే.. వారి ప్రైవేట్ సంపాదనే ఎక్కువన్నది ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు కరోనాతో వ్యక్తిగత ఇన్‌కమ్‌కు గండిపడటంతో విరుగుడు కనిపెట్టారట. అదెలాగో ఈ స్టోరీలో చూద్దాం. ప్రైవేట్ ట్రావెల్స్తో సొంత ఒప్పందాలు? అవినీతిలో మిగతా అన్ని ప్రభుత్వ విభాగాలంటే రెండాకులు ఎక్కువే చదివారని రవాణశాఖపై తరచూ విమర్శలు వస్తుంటాయి. ఆ శాఖలో వెలుగు చూసే యవ్వారాలు కూడా ఆ…
అమ్మ అడగదు… అడుక్కోనివ్వదు. ఆ పార్టీ నేతల తీరు కూడా అలాగే ఉందట. ఏపీకి ఇచ్చిన హామీల అమలుపై వాళ్లు అడగలేరు. పైగా అడిగేవాళ్లకు అడ్డుపడుతున్నారట. ఈ అంశంపైనే ఇప్పుడు సెటైర్లు పేలుతున్నాయి. వారెవరో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. ఏపీకి ఇచ్చిన హామీలపై బీజేపీ నేతలు అడగలేరు? విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు అనేక హామీలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. రెవెన్యూ లోటు భర్తీ దగ్గర నుంచి.. కీలక సంస్థల ఏర్పాటు.. పోలవరం నిర్మాణం.. ప్రత్యేక హోదా..…
ఈ నెల 19 వ తేదీన వ్యాపారి రాహుల్ తన కారులోనే శవమై కనిపించాడు. అయితే, అతడు ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే ఎవరైనా హత్యచేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. అక్కడ దొరికిన ఆధారాలను బట్టి రాహుల్‌ను హత్యచేశారనే నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే ఆరుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే, రాహుల్‌ను హత్య కేసులో ప్రధాన నిందితుడైన కోరాడ విజయ్ కుమార్…