ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా తక్కువ ఎత్తులో నైరుతి గాలులు/ పశ్చిమ గాలులు వీస్తున్నాయని.. ఈ నేపథ్యంలో ఏపీకి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈరోజు దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు,…
శ్రీశైలం డ్యామ్ ఏళ్లుగా పేరుకుపోయిన పూడికను తీసేందుఉ సర్వే మొదలు పెట్టారు.. డ్యామ్‌లో పూడికపై హైడ్రో గ్రాఫిక్ సర్వే చేస్తోంది ముంబైకి చెందిన 12 మంది నిపుణుల బృందం.. శ్రీశైలం డ్యామ్‌లో బోటుపై ప్రయాణిస్తున్న ఈ టీమ్.. బోటుపై నుంచి పరికరాలను నీటిలోకి పంపి పూడిక పరిమాణం ఏ స్థాయిలో ఉంది.. తీస్తే ఎంత మేర పూడిక తీయాల్సి ఉంటుంది అనే విషయాలపై లెక్కలు వేస్తోంది సర్వే బృందం.. కాగా, 308.62 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యంతో…
ఏపీలోని వివిధ జిల్లాల వ్యాప్తంగా 23 చోరీ కేసులు చేసిన గజదొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా పెదగొన్నూరులో నిందితుడు గుబిలి సుబ్రహ్మణ్యంను అదుపులోకి తీసుకున్నారు. ఈ నిందితుడు ప్రధానంగా సీసీ కెమెరాలు, వైఫై రౌటర్లు, డీవీఆర్ లు చోరీ చేసేవాడని తెలిపారు. అంతేకాదు చోరీల్లో సుబ్రహ్మణ్యం చాలా ప్రత్యేకమైన వ్యక్తి.. ఖద్దరు చొక్కా, తెల్ల పంచె ధరించి దొంగతనాలకు వెళ్లేవాడని వివరించారు.సీసీ కెమెరాల దొంగతనం బోర్ కొట్టిందో లేక పెద్ద దొంగతనంతో సెట్ అయ్యిపోవాలి…
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జేఎన్టీయూ వర్శిటీ సిబ్బంది తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాకినాడ జెఎన్టీయూ గెస్ట్ హౌజ్ లో ఏకంగా శోభనం జరిపించడం కలకలం రేపుతోంది. ఓ గది లో నూతన వధువరులకు శోభనం తంతు నిర్వహించారట. ఈ నెల 18 న యూనివర్శిటీకి చెందిన మహిళ సాధికారిత డైరెక్టర్ పేరు మీద 201 నంబర్ గల రూమ్ బుక్ చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ…
తెలుగుదేశం పార్టీ అయినా, ఆ పార్టీ నేతలైనా ఒంటికాలిపై లేచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్.. మరోసారి ఆ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. తాడేపల్లిలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ.. తెలుగు తాలిబన్ పార్టీ అంటూ కామెంట్ చేశారు.. దళితుడిగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? అగ్ని కుల క్షత్రియులను తరిమి తరిమి కొడతామని చెప్పింది చంద్రబాబు అని వ్యాఖ్యానించారు జోగి రమేష్.. నా మీద కేసు పెట్టాలని టీడీపీ నేతలు డీజీపీకి…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత కిందకు దిగింది… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 61,678 శాంపిల్స్ పరీక్షించగా.. 1,217 మందికి పాజిటివ్ గా తేలింది.. మరో 13 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇదే సమయంలో 1,535 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్ టెస్ట్‌ల సంఖ్య 2,60,34,217కు పెరగగా… మొత్తం…
మంత్రి కొడాలి నానిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు.. మా ప్రభుత్వం వస్తే.. కొడాలి నానిని అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టినట్టు కొట్టిస్తానంటూ హెచ్చరించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమన్న ఆయన.. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటూ హితవుపలికారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి.. ప్రభుత్వాన్ని, సీఎంను, మంత్రులను ప్రతిపక్ష…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే పలువురు నిందితులు, అనుమానితులను విచారిస్తోంది సీబీఐ టీమ్.. మరికొందరిని అదుపులోకి కూడా తీసుకుంది.. పులివెందుల ఆర్అండ్బీ అతిథి గృహంలో ఎంపీ అవినాష్ తండ్రి భాస్కర్‌రెడ్డి, చిన్నాన్న మనోహర్‌రెడ్డి, వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిని సీబీఐ బృందం మరోసారి విచారణకు పిలిచింది. మరోవైపు వివేకా కుమార్తె సునీత మధ్యమధ్యలో సీబీఐ అధికారులను కలుస్తూ కేసు దర్యాప్తు…
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.. ఇటు విజయవాడ సిటీతో పాటు.. అటు వైజాగ్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉదయం నుంచి ఏకదాటిగా వర్షం కురుస్తుంది.. ఈ తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది అమరావతి వాతావరణ కేంద్ర… ఏపీలో నేడు, రేపు విస్తారంగా వర్షాలు కురుస్తాయని.. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది.. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన…
శ్రీశైలం జలాశయంలో వరద నీరు కొనసాగుతుంది. ఇప్పటికే కృష్ణ నది పై ఉన్న శ్రీశైలం జలాశయంలోకి వరద వచ్చి చేరుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 38,869 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో 42,210 గా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 878.50 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 180.6725 టీఎంసీలు ఉంది. అయితే ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం నుండి…