విజయవాడ : శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఇంద్రకీలాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం 5 గంటల నుండి క్యూలైన్లో వేచి ఉన్నారు భక్తులు. అటు వరలక్ష్మీ దేవి, లక్ష్మీ దేవి గా అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. దీంతో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు సంతోషంగా ఉందంటున్నారు. ఇక అమ్మవారి మూలవిరాట్ విగ్రహానికి వరలక్ష్మి దేవి అలంకరణ చేశారు ఆలయ సిబ్బంది. శ్రావణ మాసం మూడవ శుక్రవారం అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నారు. ఇక ఇది ఇలా ఉండగా… అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు అన్ని ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. కరోనా నిబంధనలు కఠినం చేసిన ఆలయ అధికారులు… మాస్క్‌లు లేకపోతే…భక్తులకు అనుమతి ఇవ్వడం లేదు.