ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్ కేసుల భారీగా పెరిగిపోయాయి.. ప్రస్తుతం హైకోర్టు, సుప్రీంకోర్టులో కలిపి వివిధ కోర్టుల్లో 1.94 లక్షల మేర పెండింగ్ కేసులు ఉన్నట్టు గుర్తించింది ప్రభుత్వం.. ఇక, దీనికి తోడు ప్రస్తుతం రోజూ సగటున 450 కొత్త దావాలు దాఖలవుతున్నాయని చెబుతున్నారు.. దీంతో.. అన్ని డిపార్ట్‌మెంట్లలో ఉన్న పెండింగ్ కేసులు సత్వర పరిష్కారం కోసం చర్యలు ప్రారంభించింది ఏపీ సర్కార్.. దీనికోసం ఆన్‌లైన్ లీగల్ కేస్ మానీటరింగ్ సిస్టమ్ అనే కొత్త వ్యవస్థ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.. కేసుల పర్యవేక్షణ కోసం ప్రతి డిపార్ట్‌మెంట్‌లో ఒక నోడల్ అధికారిని నియమించారు.. రాష్ట్రస్థాయిలో నోడల్ అధికారిగా సీనియర్ ఐఏఎస్ బాబును నియమించింది సర్కార్.
ప్రస్తుతం హైకోర్టులో వినియోగిస్తున్న అప్లికేషన్ ప్రోటోకాల్ ఇంటర్ ఫేస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ కేసులు పర్యవేక్షణ జరగనుంది.. అన్ని గవర్నమెంట్ ప్లిడర్ కార్యాలయాల్లో ఆటోమేషన్ ఏర్పాటు చేయనున్నారు.. ఇక పై ఆయా డిపార్ట్‌మెంట్ కేసుల వివరాలు.. విచారణ తేదీలు తదితర అంశాలపై ఎప్పటికప్పుడు అలర్ట్ చేయనుంది ప్రభుత్వం.. దీంతో పాటుగా ప్రభుత్వానికి సంభందించిన అన్ని కేసుల వివరాలను డ్యాష్ బోర్డులో ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు.. దీనిని రియల్ టైంలో పర్యవేక్షణ చేయనుంది వైఎస్ జగన్ సర్కార్.. ప్రస్తుతం తెలంగాణలో ఇటువంటి పద్దతి 5 డిపార్ట్‌మెంట్లలో అమల్లో ఉండగా.. అదే విధానాన్ని ఏపీలో అన్ని విభాగాల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. కొద్ది రోజులు క్రితం న్యాయ శాఖ, ఇతర న్యాయ అధికారులతో సమీక్ష చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాధ్ దాస్… ఆయా శాఖల్లోని కోర్టు కేసులపై ప్రతి నెల హెచ్‌వోడీలతో సమీక్ష చేయాలని అన్ని శాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఏపీ సీఎస్.