ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ… పెరుగుతూ వస్తుంది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రం లో గత 24 గంటల్లో 54,455 శాంపిల్స్ పరీక్షించగా.. 1,321 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 19 మంది కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు. ఇక, ఒకేరోజు 1,499 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. రాష్ట్రంలో నేటి వరకు 2,64,71,272 శాంపిల్స్ పరీక్షించగా.. ఇప్పటి వరకు నమోదైన…
వాయువ్య మరియు పశ్చిమమధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో ఒడిశా- ఉత్తరాంధ్ర తీరం వెంబడి అల్పపీడనం ఏర్పడినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో మంగళవారం వరకు విస్తారంగా వర్షాలు పడనున్నాయి. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు.. రేపు రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. తీరం వెంబడి గంటకు 50-60 కీ.మీ వెగంతో గాలులు వీస్తుండటంతో సముద్రం అలజడిగా ఉంటుంది. కాబట్టి రేపటి వరకు మత్స్యకారులు…
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం కొనసాగుతూనే ఉంది.. ఫిర్యాదులు, లేఖలు నడుస్తూనే ఉన్నాయి.. తాజాగా కేఆర్ఎంబీ చైర్మన్ కు మరోలేఖ రాసింది తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ… బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం మాత్రమే.. దాని నుండి కృష్ణా బేసిన్ ఆవలకు నీటి మల్లింపును ట్రిబ్యునల్ అనుమతించలేదని.. హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు నుండి బేసిన్ ఆవలకి నీటి తరలింపు వల్ల బేసిన్ లోని తెలంగాణ ప్రాజెక్టులు నష్టపోతాయని కేఆర్ఎంబీ దృష్టికి తీసుకెళ్లారు.. నది ఒడ్డున ఉన్న…
అమరావతి : పదో తరగతిలో మళ్లీ మార్కుల విధానాన్ని పునరుద్ధరిస్తూ ఏపీ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్ల స్థానంలో మార్కుల విధానాన్ని తీసుకువస్తున్నట్టు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. విద్యార్ధుల్లో ప్రతిభను గుర్తించేందుకు మార్కుల విధానమే సరైదంటూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సిఫార్సులు చేశారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు సీబీఎస్ఈ అనుసరించే గ్రేడింగ్ విధానాన్ని 2019 వరకూ అమలు చేసింది ప్రభుత్వం. కోవిడ్ కారణంగా 2020లో పదో తరగతి పరీక్షలు రద్దు కావటంతో గ్రేడ్…
ఇవాళ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ – వైఎస్ భారతిల 25 వ వివాహ వార్షికోత్సవం. ఈ నేపథ్యం లో వైసీపీ పార్టీ లో కోలాహలం నెలకొంది. ఇక అటు వైసీపీ మంత్రులు మరియు ఎమ్మెల్యే లతో పాటు పలువురు నాయకులు జగన్ దంపుతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ మేరకు ఏపీలో ఓ భారీ కటౌట్ సందడి చేస్తోంది. శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే మధు సూదన్ రెడ్డి ఈ భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. జగన్-…
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పెండింగ్ కేసులు దాదాపు 2 లక్షలుగా ఉన్నాయి… ప్రస్తుతం హైకోర్టు, సుప్రీంకోర్టులో కలిపి వివిధ కోర్టుల్లో 1.94 లక్షల మేర పెండింగ్ కేసులు ఉన్నట్టు గుర్తించింది ప్రభుత్వం.. ఇక, దీనికి తోడు ప్రస్తుతం రోజూ సగటున 450 కొత్త దావాలు దాఖలవుతున్నాయని చెబుతున్నారు.. ఈ కొత్త పిటిషన్లకు సమాధానమివ్వడానికే ప్రతి రోజూ కనీసం 40 వేల పేజీల పేపర్‌వర్క్ చేయాల్సి వస్తోంది. మాపై లిటిగేషన్ల భారం ఎంత ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం అంటున్నాడు…
చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో పంట పొలాలపై ఏనుగులు గుంపులుగా వచ్చి తీవ్రంగా నష్టం చేకూరుస్తున్నాయి. పంట చేతికొచ్చే సమయానికి ఏనుగుల దాటి చేయడంతో భారీగా పంటనష్టం జరుగుతోంది. తోటకనుమ గ్రామపంచాయితీ దండికుప్పం పంట పొలాలపై ఏనుగుల గుంపులుగా విరుచుకుపడుతున్నాయి. పూతదశలో పంటను తినేసిసిన 20 ఏనుగుల గుంపు.. పది ఎకరాలకుపైగా వరి పంటను నాశనం చేశాయి. సుమారు అయిదు లక్షల వరకు ఆస్తినష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు పట్టించుకోని, ఆదుకోవాలని…
మద్యం అమ్మకాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏపీ సరిహద్దు గ్రామాల్లో క్యాన్ బీర్ అమ్మకాలకు అనుమతి ఇవ్వలేదు ఏపీ ప్రభుత్వం.. రాష్ట్ర సరిహద్దుల్లో 90 ఎంఎల్ పరిమాణంలో మద్యం అమ్మకాలకు మాత్రమే ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. అక్రమ రవాణా, నాటు సారా, గంజాయి వినియోగం తగ్గించేందుకు క్యాన్ బీర్ బాటిళ్లకు అనుమతించలేదని.. 90 ఎంఎల్ లిక్కర్‌కు అనుమతిచ్చామంటోంది ప్రభుత్వం. ఎక్సైజ్ శాఖ పరిధిలోని కెమికల్ ల్యాబ్స్ ఆధునికీకరణకు నిర్ణయం తీసుకుంది..…
కేంద్ర ప్రభుత్వనికి తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. వెలిగొండ ప్రాజెక్టుకు కృష్ణా ట్రైబ్యునల్ లో కేటాయింపులు లేవని.. వరద జలాల ఆధారంగా ఆ ప్రాజెక్టును చేపట్టారని లేఖ లో పేర్కొన్నారు. వెలిగొండకు అనుమతులు లేవన్నారు. ఆ ప్రాజెక్టు ద్వారా కృష్ణా బేసిన్ వెలుపలకు నీరు తరలిస్తున్నారని.. ఈ అంశం పై గతంలోనే ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. అనుమతి లేని ప్రాజెక్టుకు ఏఐబీపీ కింద నిధులివ్వడం పై ఈఎన్సీ అభ్యంతరం వ్యక్తం చేసింది తెలంగాణ సర్కార్. ఇది…
ఒక చిన్న ఇల్లు, మూడు బల్బులు, ఒక ఫ్యాన్, ఒక టీవి… ఇలాంటి ఇంటికి నెలకు కరెంట్ బిల్లు ఎంత వస్తుంది. మామూలుగా అయితే రూ.200 వరకు వస్తుంది. అయితే, అలాంటి ఇంటికి ఏకంగా లక్షల్లో కరెంట్ బిల్లు వచ్చింది. ఆ బిల్లును చూసిన ఇంటి యజమానికి గుండెనొప్పి వచ్చినంత పనైంది. వెంటనే విద్యుత్ శాఖాధికారుల దగ్గరకు వెళ్లి బిల్లు చూపించి ఇదేంటని అడిగితే… కట్టాల్సిందే అన్నారట. కావాలంటే కొంత డిస్కౌంట్ ఇస్తామని చెప్పారట. ఈ సంఘటన…