ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ప్రతిరోజూ వెయ్యికిపైగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇక స్కూళ్లు తిరిగి ప్రారంభించిన తరువాత ఈ కేసుల సంఖ్య మరింతగా పెరిగింది. ప్రతిరోజూ స్కూళ్లలో విద్యార్దులు, ఉపాద్యాయుడు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే, గడిచిన 24 గంటల్లో ఏపీలో 1539 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,07,730కి చేరింది. ఇందులో 19,79,704 మంది కొలుకొని డిశ్చార్జ్ కాగా,…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా పశ్చిమ గాలులు/ వాయువ్య గాలులు వీస్తున్నాయి. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం…
అప్పుడప్పుడు మత్స్యాకారుల వలకు ఆరుదైన చేపలు దొరుకుతుంటాయి. అలా దొరికిన అరుదైన చేపలను అధికమొత్తానికి అమ్ముతుంటారు. అయితే, కొన్ని రకాల చేపలు మాత్రం భయపెడుతుంటాయి. అవి అరుదైన చేపలు మాత్రమే కాదు.. డేంజర్ కూడా. విదేశాల నుంచి దేశానికి వివిధ మార్గాల ద్వారా వచ్చిన అక్వేరియం చేప సక్కర్ క్యాట్‌ఫిష్ చేపలు ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వ్యాపించాయి. వేగంగా ఈ చేపలు వాటి సంతతిని పెంచుకుంటాయి. అంతేకాదు, ఈ చేపల శరీరంపై నల్లని చారలు…
కరోనా కారణంగా దాదాపు రెండేళ్లుగా విద్యార్ధుల చదువులు అటకెక్కేశాయి. స్కూళ్లకు తాళాలు పడ్డాయి. పరీక్షల నిర్వహణ కూడా సక్రమంగా జరగలేని పరిస్థితి నెలకొంది. అయితే విద్యార్ధుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని విద్యాసంస్థలు తెరవాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. ఇటీవలే స్కూళ్లు కూడా తెరుచుకున్నాయి. మొదట్లో విద్యార్ధుల హాజరు శాతం తక్కువగా ఉన్నా.. క్రమంగా పుంజుకుంది. అలాగే స్కూళ్లలో అన్ని రకాల జాగ్రత్తలు సైతం తీసుకుంటున్నారు. అయినా కొన్ని చోట్ల కరోనా కేసులు బయటపడడం కలకలం రేపింది. విజయనగరం…
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ఉత్కంఠ రేపుతోంది. ఎవరికి వారే తమ తమ వాటాల కోసం పట్టుబడుతుండడంతో ఈ పంచాయతీ ఇప్పట్లో తెగేలా కనిపించడం లేదు. మరోవైపు ఇటీవల సమావేశాలకు హాజరుకాని తెలంగాణ… సెప్టెంబర్ 1న జరిగే KRMB మీటింగ్‌కు హాజరవ్వాలని నిర్ణయించింది. ఈసారి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే ఈ సమావేశానికి వెళ్లనున్నారు. న్యాయంగా రావాల్సిన కృష్ణా జలాల్లో ఒక్క బొట్టుకూడా వదులుకునేది లేదని తేల్చి చెప్పేశారు. కృష్ణా జలాలపై కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో…
జేఈఈ మెయిన్ చివరి విడత(నాలుగు) పరీక్షలు దేశవ్యాప్తంగా గురువారం మొదలుకానున్నాయి. ఈ నెల 26, 27, 31, సెప్టెంబరు 1, 2వ తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. మొదటి రోజు బీఆర్క్, బీ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి పేపర్-2 పరీక్షలు జరుగుతాయి. ఆ తర్వాత నుంచి బీటెక్ కోసం పేపర్-1 నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా దాదాపు 7.40 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలు పూర్తయిన తర్వాత దేనిలో అధిక స్కోర్ వస్తే దాన్ని పరిగణనలోకి తీసుకొని…
నేడు కుటుంబం తో కలిసి సిమ్లా కు వెళ్లనున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ నెల 28వ తేదీన వైఎస్ జగన్ జీవితంలో ఓ స్పెషల్‌డే కానుంది.. అదే జగన్-భారతి పెళ్లిరోజు.. పెళ్లి రోజు మాత్రమే కాదు.. సిల్వర్ జూబ్లీ జరుపుకోనున్నారు.. వైఎస్ జగన్-భారతి పెళ్లి జరిగి 25 ఏళ్లు కావస్తుంది.. ఈ సందర్భంగా.. రాజకీయాలు, సీఎం బాధ్యతలకు దూరంగా ఐదు రోజుల పాటు పూర్తిగా ఫ్యామిలీతో గడిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే…
మెడికల్ టూర్ నిమిత్తం రేపు కేరళ వెళ్లనుంది ఆంధ్రప్రదేశ్ బృందం.. ఐఏఎస్ అహ్మద్ బాబు నేతృత్వంలో కేరళలోని వైద్య విధానాలను అధ్యయనం చేయనుంది ఆంధ్రప్రదేశ్ టీమ్.. కేరళ ప్రభుత్వం అవలంభించిన కరోనా వ్యాప్తి నిరోధక చర్యలనూ పరిశీలించనున్నారు ఏపీ అధికారులు.. కేరళ వైద్య విధానాలను ఏపీలో అవలంభించాలని భావిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కాగా, సీఎం వైఎస్ జగన్ సూచనలతో కేరళ వెళ్లనుది ఏపీ అధికారుల బృందం. మరోవైపు.. కేరళలో కరోనా మొదటి దశలో.. రెండో వేవ్‌లోనూ…
ఆంధ్రప్రదేశ్‌లో బోగస్ చలాన్ల వ్యవహారం సంచలనం సృష్టించింది.. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. ఆ స్కామ్ వెనుక ఉన్నవారి బరతపడుతోంది.. బోగస్ చలానాల వల్ల పక్కదారి పట్టిన నిధులు.. రూ.7.14 కోట్లుగా గుర్తించామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. బోగస్ చలాన్ల స్కాంలో ఇప్పటి వరకు 3 కోట్ల 39 లక్షలు రికవరీ అయ్యాయన్నారు. ఇక కొత్త సాఫ్ట్ వేర్‌తోనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని.. అదనపు ఐజీ ఆధ్వర్యంలో ఇప్పటికే ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామన్నారు ధర్మాన.…