Trump-Iran: ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్.. ఈ రాత్రికి భీకర దాడులుంటాయని హెచ్చరిక
- ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
- ఈ రాత్రికి భీకర దాడులుంటాయని హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్‌కు మరోసారి అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ రాత్రే మళ్లీ భారీ దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అంతకముందు ఇరాన్‌తో ఒప్పందం ముగిసిందని తెలిపారు. అలా ప్రకటన వెలువడిన కొద్ది గంటలకే హెచ్చరించారు. దీంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు రేకెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే గురువారమే ఖమేనీ అంత్యక్రియలు జరగనున్నాయి. ఇందుకోసం లక్షలాది మంది తరలివచ్చారు. ఇలాంటి తరుణంలో ట్రంప్ వార్నింగ్ ఇవ్వడం టెన్షన్ వాతావరణం నెలకొంది.
టర్కీ రాజధాని అంకారాలో జరుగుతున్న నాటో శిఖరాగ్ర సమావేశం సందర్భంగా మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్‌పై అమెరికా మరింత కఠిన వైఖరితో ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. ‘‘గత రాత్రి మేము ఇరాన్‌పై చాలా తీవ్రంగా దాడి చేశాం. చాలా బలంగా దెబ్బకొట్టాం. ఈ రాత్రి కూడా మళ్లీ భారీ దాడులు చేసే అవకాశం ఉంది. ముందుగానే చిన్న హెచ్చరిక ఇస్తున్నా.. ఈ రాత్రి వారిని గట్టిగా దెబ్బతీస్తాం.’’ అని అన్నారు.
Also Read
ఇరాన్ ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్.. ఆ దేశం వాణిజ్య నౌకలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తోందని ఆరోపించారు. ‘‘వాళ్లు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మధ్యప్రాచ్యంలో 47 ఏళ్లుగా ఇరాన్ రౌడీయిజం చేసింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వాళ్లు ఇక మధ్యప్రాచ్యాన్ని భయపెట్టలేరు. మా లక్ష్యం ఒక్కటే.. ఇరాన్ అణ్వాయుధాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పొందకూడదు.’’ అని స్పష్టం చేశారు. నాటో సమావేశం పక్కన మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్‌తో జరిగిన చర్చలపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశాల్లో అంగీకరించిన విషయాలను బయటకు వెళ్లిన తర్వాత ఇరాన్ నాయకులు ఖండిస్తున్నారని ఆరోపించారు.
‘‘మేము సమావేశాల్లో మాట్లాడితే ప్రతిదానికీ అంగీకరిస్తారు. కానీ బయటకు వెళ్లి మీడియా సమావేశంలో మేము అలాంటి చర్చలే జరపలేదు అంటారు. వాళ్లు పూర్తిగా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఈ వ్యక్తుల్లో ఏదో తేడా ఉంది” అంటూ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజా వ్యాఖ్యల్లో ట్రంప్ మరోసారి కఠిన హెచ్చరిక చేశారు. అవసరమైతే ఇరాన్‌కు చెందిన మరిన్ని నౌకలను ధ్వంసం చేయగలమని, విద్యుత్, నీటి సరఫరా వ్యవస్థలను కూడా లక్ష్యంగా చేసుకునే సామర్థ్యం అమెరికాకు ఉందని అన్నారు. అయితే వెంటనే తన వ్యాఖ్యలను సవరించుకుంటూ అలా చేయాలని మాత్రం తాను కోరుకోవడం లేదని చెప్పారు.
Trump on Iran: "I don't know if we're going to have a deal… They lie and they cheat… They've misbehaved for 47 years. They've killed our soldiers; they've killed our people… We have a score to settle." pic.twitter.com/19AmYgKHSY
— Open Source Intel (@Osint613) July 8, 2026
- Tags
- Donald Trump
- Iran
- trump
- us
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?