Rainbow Hospital: 5వ అంతస్తు నుంచి జారి పడిన బాలుడు.. పునర్జన్మనిచ్చిన రెయిన్బో హాస్పిటల్ వైద్యులు..
- బాలుడు నిజంగా మృత్యుంజయుడు..
- సమిష్టి వైద్య బృందం అంకితభావానికి నిదర్శనం..
- బతుకుతాడనే ఆశలేని 13 ఏళ్ల బాలుడిని కాపాడిన రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రమాదవశాత్తు భవనం 5వ అంతస్తు నుండి జారిపడిన 13 ఏళ్ల బాలుడిని ముందుగా నిజాంపేట సమీపంలోని ఒక హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ బాలునికి వెంటిలేటర్ అమర్చి, మెరుగైన చికిత్స కొరకు కూకట్‌పల్లిలోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు పంపించారు. ఆ సమయంలో బాలుడు తీవ్రంగా రక్తం కారిపోయి, బి.పి. బాగా తగ్గిపోయి షాక్‌లో ఉన్నాడు. వెంటనే పీడియాట్రిక్ ఐసియు (PICU) వైద్య బృందం పరిస్థితిని అదుపు చేయడానికి అనేక లీటర్ల సెలైన్, రక్తం మరియు రక్త ఉత్పత్తులు ఎక్కిస్తూనే, ప్రాణాంతకమైన ఇతర గాయాలకు చికిత్స అందించారు. మరింత నిరంతర ఐసియు సేవలు మరియు మెరుగైన వైద్య సహాయం కొరకు బాలుడిని బంజారాహిల్స్‌లోని రెయిన్బో హాస్పిటల్‌కు తరలించారు.
సవాలుగా మారిన బహుళ అవయవాల గాయాలు..
పిల్లలలో అరుదుగా ఒకేసారి కనిపించే తీవ్రమైన గాయాల కలయిక నుండి ఈ బాలుడు ప్రాణాలతో బయటపడటం అసాధారణమైన పీడియాట్రిక్ ట్రామా రికవరీలలో ఒకటిగా నిలిచింది.
Also Read
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
- Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
- World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
- CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
గుండె నుండి రక్త సరఫరా చేసే ప్రధాన రక్తనాళానికి ప్రాణాంతకమైన గాయమైంది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం ఇటువంటి గాయాలైన వారిలో 80-90% మంది ఆసుపత్రికి వచ్చేలోపే మరణిస్తారు. మిగిలిన వారిలో 50% మంది మొదటి 24 గంటల్లోనే చనిపోతారు. చికిత్స చేయకపోతే అధిక రక్తస్రావంతో మరణం సంభవిస్తుంది. ఇలాంటి సంక్లిష్టమైన కేసును ఒకే విభాగం నిర్వహించలేదు. అందువల్ల కార్డియాలజీ, ఇంటెన్సివ్ కేర్, సర్జరీ, అనస్థీషియా, రేడియాలజీ విభాగాలతో పాటు క్రింది నిపుణుల సమిష్టి సహకారం అవసరమైంది. వారు పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ & పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్, పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ & పీడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్, పీడియాట్రిక్ సర్జన్ & ఆర్థోపెడిక్ సర్జన్, పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, క్రిటికల్ కేర్ నర్సులు మరియు ఫిజియోథెరపిస్ట్‌లు.
పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (PICU) మరియు కార్డియాలజీ బృందం అధునాతన ఇమేజింగ్, బెడ్‌సైడ్ ఎకోకార్డియోగ్రఫీ ద్వారా బృహద్ధమని గాయాన్ని గుర్తించి, అయోర్టిక్ స్టెంటింగ్ (Endovascular Stent) ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. దీనివల్ల రక్తనాళం సవరించబడటంతో, వైద్యులు ఇతర గాయాలపై దృష్టి పెట్టగలిగారు.
ఆ తర్వాత ఊపిరితిత్తులు, ప్యాంక్రియాస్, కిడ్నీ గాయాలను నయం చేస్తూ రాగా, హాస్పిటల్లో చేరిన రెండవ వారంలో బాలుడు క్రమంగా కోమా నుండి కోలుకున్నాడు. ఆ తర్వాత వెంటిలేషన్ తొలగించి, మెదడును రక్షించే న్యూరో ఇంటెన్సివ్ కేర్ పర్యవేక్షణ మరియు మద్దతు అందించారు.
డాక్టర్ అనుపమ వై (సీనియర్ కన్సల్టెంట్ – పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ మరియు పీడియాట్రిషియన్):
“బాలుడు హాస్పిటల్‌కు వచ్చినప్పుడు ప్రధాన అవయవ వ్యవస్థలన్నీ దెబ్బతిని ఉన్నాయి. కేవలం ఒక్క గాయానికి చికిత్స చేయడం కాకుండా, ప్రతి అవయవం మళ్లీ పనిచేసేలా చూడటంపై దృష్టి పెట్టాము. జీర్ణాశయాంతర రక్తస్రావం నుండి సెప్టిక్ షాక్ వరకు దీర్ఘకాలం మెకానికల్ వెంటిలేషన్, డయాలసిస్ మరియు ఇంటెన్సివ్ పర్యవేక్షణ అవసరమయ్యాయి. మా ఐసీయూ నర్సులు, పారామెడికల్ సిబ్బంది, నిపుణులు రేయింబవళ్లు అవిశ్రాంతంగా చేసిన సేవలే ఆ బిడ్డ కోలుకోవడంలో కీలక పాత్ర పోషించాయి.”
డాక్టర్ నాగేశ్వర రావు కోనేటి (చీఫ్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్, రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్):
“ఈ కేసులో థొరాసిక్ అయోర్టిక్ గాయం అత్యంత క్లిష్టమైనది. దీనికి తక్షణ చికిత్స అవసరం, కొద్దిపాటి ఆలస్యమైనా ప్రాణాంతకం కావచ్చు. ఎండోవాస్కులర్ స్టెంట్ ప్రక్రియ ద్వారా దెబ్బతిన్న రక్తనాళాన్ని సవరించడం వల్ల, ఇంటెన్సివ్ కేర్ బృందం ఇతర గాయాలను నయం చేయడంపై దృష్టి పెట్టగలిగింది.”
పూర్తి ఆరోగ్యంతో ఆ బాలుడు 5 వారాల తర్వాత హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్ళాడు. విరిగిన తొడ ఎముక నయం కావడానికి మరికొంత కాలం బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు సూచించారు. డిశ్చార్జ్ అయిన కొన్ని వారాల తర్వాత, ఆ బాలుడు ఒక నవ్వుతున్న యువ కళాకారుడిగా మారి తిరిగి హాస్పిటల్‌కు వచ్చాడు. ప్రాణాపాయ స్థితి నుండి తనను కాపాడిన వైద్య బృందానికి కృతజ్ఞతగా, తాను స్వయంగా చేసిన ఒక అందమైన కళాకృతిని ప్రశంసా చిహ్నంగా వైద్యులకు బహుమతిగా అందించాడు. వైద్యుల బృందంలో డాక్టర్ అనుపమ ఎర్ర, డాక్టర్ కోనేటి నాగేశ్వరరావు, డాక్టర్ ఫర్హాన్, డాక్టర్ ప్రశాంత్ బాచిన, డాక్టర్ కోనాకి రమేష్, డాక్టర్ వెంకట్రామ్ తాళ్లపల్లి ఉన్నారు. సంప్రదింపుల కొరకు మల్లిఖార్జున రావు ఫోన్ 89786 73555 చేయవచ్చు.
తాజావార్తలు
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
-
Theater Plus: ఓటీటీ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు.. రూపాయి కట్టకుండానే 3 మలయాళ బ్లాక్ బస్టర్స్ ఫ్రీ!
-
Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
-
Impure : పెళ్లి కూతురు ‘కన్య’ కాదని పెళ్లి క్యాన్సిల్.. టాలీవుడ్‌ను షేక్ చేసే బోల్డ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘ఇంప్యూర్’!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!