తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మంత్రి శంకరనారాయణ. అనంతరం ఆయన మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ కి సినిమా కాల్షిట్లు లేకపోతే రాజకీయలు గుర్తుకు వస్తాయి అని కామెంట్ చేసారు. టీడీపీ, జనాసేన ఉనికి కోల్పోతున్న నేఫధ్యంలో రోడ్లు పై రాజకీయాలు చేస్తూన్నాయి అని అన్నారు. టీడీపీ ప్రభుత్వం రోడ్ల నిర్వహణ నిధులు ప్రక్కదారి పట్టించడంతోనే… రోడ్లకు ఈ దుస్థితి వచ్చింది అని ఆరోపించారు. సోము వీర్రాజుకు అవగాహన లేక కేంద్ర నిధులు ప్రక్కదారి పట్టాయని విమర్శిస్తూన్నారు. వచ్చే ఏడాది మే లోపు రోడ్లు మరమత్తు పనులు పూర్తి చేసేలా టెండర్లు పిలుస్తూన్నాం అని తెలిపారు. ఇక దివాకర్ రెడ్డి బ్రదర్స్ ని ప్రజలు ఎప్పుడో ప్రక్కన పెట్టేసారు…వారు మదం ఎక్కి మాట్లాడుతున్నారు… వారి వ్యవహార శైలితో చంద్రబాబు తలపట్టుకుంటున్నాడు అని పేర్కొన్నారు మంత్రి శంకరనారాయణ.