ఆ జిల్లాలో మొన్నటి వరకు ఒక్కరే పెత్తనం చేసేవారు. అధికారులకు పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. అధికార పార్టీలో గ్రూపులు పెరిగి.. ఉద్యోగుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. కొత్త సమస్యలు తెరపైకి వస్తున్నాయి. తిరుగుబాటులు మొదలయ్యాయి. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఎవరూ పట్టించుకోవడం లేదని అధికారపార్టీ నేతలు జూలు విదిల్చారా? పదేళ్లు అధికారంలో లేం. పవర్లోకి వచ్చాక చెబుతాం. రెండేళ్ల క్రితం వైసీపీ నేతల వాయిస్ ఇది. కానీ.. సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాల…
ఒక ఉపరితల ఆవర్తనం దక్షిణ ఆంధ్ర ప్రదేశ్-ఉత్తర తమిళనాడు కోస్తా తీరాలకు దగ్గరగా పశ్చిమ మధ్య & దానిని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతం లలో సగటు సముద్రమట్టానికి 1.5 km నుండి 3.1 km ఎత్తుల మధ్య ఏర్పడింది. దక్షిణ గుజరాత్ నుండి దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టం నుండి 3.1 km నుండి 5.8 km ఎత్తుల మధ్య నిన్న ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడింది. ఉత్తర కోస్తా…
కార్వీ స్కామ్ తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులకు షాక్ ఇచ్చిందా? పెట్టుబడులు పెట్టిన వారు.. కక్కలేక మింగలేక ఆందోళన చెందుతున్నారా? ముందుకొచ్చి పోలీస్ కంప్లయింట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదా? అధికార, రాజకీయవర్గాల్లో కార్వీపై జరుగుతున్న చర్చ ఏంటి? కార్వీలో తెలుగు రాష్ట్రాల ప్రముఖుల పెట్టుబడులు! కార్వీ కుంభకోణంలో CCS పోలీసులు తవ్వేకొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సామాన్యుల పెట్టుబడులు ఎలా ఉన్నా.. తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేకమంది ప్రముఖులు పార్థసారథిని చూసే కార్వీలో ఇన్వెస్ట్ చేశారు.…
రాజకీయాలు ఎన్నికల్లో చేసుకుందాం.. ముందైతే అభివృద్ధి చేద్దాం అని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం… శ్రీకాకుళం జిల్లా అక్కివరం గ్రామంలో రైతు భరోసా కేంద్రానికి శంకుస్థాపన చేసిన స్పీకర్ తమ్మినేని.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు.. మేం శంకుస్థాపనలు చేస్తుంటే కోర్టులకు వెళ్లి స్టేలు తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాలు అభివృద్ధి చేస్తుంటే ఇలా చేయడం సరికాదని హితవుపలికిన తమ్మినేని సీతారం..…
2009 సెప్టెంబర్ 2… ఆ రోజు ఏపీ సీఎం వైఎస్ఆర్ సెక్రటేరియట్లో లేరు. అయినా సి బ్లాక్ అంతా హడావుడి. అంతా ఒకటే టెన్షన్ టెన్షన్…సీఎం ఆఫీస్లో లేకపోతే అక్కడ ఏ సందడీ ఉండదు..కానీ ఆ రోజు అందుకు భిన్నం. ఆ రోజు చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి సీఎం వైఎస్ఆర్. అందుకే ఉదయం సరిగ్గా సరిగ్గా 8 గంటల 38 నిమిషాలకు బేగంపేట నుంచి హెలికాప్టర్ ఎగిరింది. 10.30 కల్లా చిత్తూరు చేరాలి.…
వైఎస్సార్ వర్ధంతి సభలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు ఎంపీ విజయసాయిరెడ్డి. జీవీఎంసీ మేయర్, కార్పొరేటర్ల కు కర్తవ్య బోధ చేసారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు… ఇక నుంచి అందరూ అభివృద్ధిపై దృష్టి పెట్టండి. అవినీతి రహిత పాలన, సమర్ధ నాయకత్వం ప్రజలు కోరుకుంటున్నారు. పదవుల విషయంలో అందరికి అవకాశాలు కల్పిస్తాం. ఇక్కడ కొన్ని ఆరోపణలు నా దృష్టికి వచ్చాయి. భూములు, పంచాయతీలు చేస్తున్నానని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. నాకు డబ్బు మీద ఆసక్తి లేదు.…
దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ ఘాట్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయ చేరుకున్న ఆయన.. వైఎస్ సమాధి దగ్గర నివాళులర్పించారు.. ఆ తర్వాత ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు… ఈ కార్యక్రమానికి వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, వైఎస్ భారతి, వారి కుటుంబసభ్యులు, పలువురు ఏపీ మంత్రులు, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు.. ఇక, వైఎస్ రాజశేఖర్…
దివంగత సీఎం, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా.. తన తండ్రిని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియా వేదికన ఓ పోస్టు చేశారు వైఎస్ జగన్.. “నాన్న భౌతికంగా దూరమై 12ఏళ్లయినా జనం మనిషిగా, తమ ఇంట్లోని సభ్యునిగా నేటికీ జన హృదయాల్లో కొలువై ఉన్నారు. చిరునవ్వులు చిందించే ఆయన రూపం, ఆత్మీయ పలకరింపు మదిమదిలోనూ అలానే నిలిచి ఉన్నాయి. నేను…
దింగత నేత వైఎఎస్సార్ వర్థంతిని పురస్కరించుకుని ఇడుపులపాయకు వైఎస్ఆర్ అభిమానులు క్యూ కడుతున్నారు. నివాళులు అర్పించేందుకు సీఎం వైఎస్ జగన్తో పాటు కుటుంబ సభ్యులు ఇప్పటికే ఇడుపులపాయకు చేరుకున్నారు. అనంతరం సొంత నియోజకవర్గ నేతలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు.. ఇక, కడప జిల్లా పర్యటనలో భాగంగా సీఎం జగన్కు.. పార్టీ శ్రేణుల నుంచి ఘనస్వాగతం లభించింది. కడప విమానాశ్రయం వద్ద, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఆయనకు…
వ్యవసాయరంగంపై నేడు సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు.రాష్ట్రంలో వర్షపాతం, పంటలసాగు, ఇ–క్రాపింగ్, వ్యవసాయ సలహామండళ్ల సమావేశాలు, ఎరువుల పంపిణీ, వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలు, ఆర్బీకేల నిర్మాణ ప్రగతి తదితర అంశాలపై సీఎం సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం వివరాలను, సాగు వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలి. చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలని సీఎం ఆదేశం ఆదేశించారు. బోర్లకింద, వర్షాధార భూములలో చిరుధాన్యాలు సాగుచేసేలా…