వైఎస్సార్ వర్ధంతి సభలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు ఎంపీ విజయసాయిరెడ్డి. జీవీఎంసీ మేయర్, కార్పొరేటర్ల కు కర్తవ్య బోధ చేసారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు… ఇక నుంచి అందరూ అభివృద్ధిపై దృష్టి పెట్టండి. అవినీతి రహిత పాలన, సమర్ధ నాయకత్వం ప్రజలు కోరుకుంటున్నారు. పదవుల విషయంలో అందరికి అవకాశాలు కల్పిస్తాం. ఇక్కడ కొన్ని ఆరోపణలు నా దృష్టికి వచ్చాయి. భూములు, పంచాయతీలు చేస్తున్నానని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. నాకు డబ్బు మీద ఆసక్తి లేదు. హైదరాబాద్ లో ఉన్నది కూడా అద్దె ఇల్లే. నా చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు. నా పేరు చెప్పి అక్రమాలకు పాల్పడితే చట్ట ప్రకారం శిక్షిస్తాం అని తెలిపారు. ఇందు కోసం రెండు టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేస్తాను. ఎవరైనా ఫిర్యాదూ చేయవచ్చు. నాకు విశాఖలో స్థిరపడాలనే కోరిక ఉంది. భీమిలి దగ్గర నాలుగు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఇల్లు కట్టుకుని జీవిస్తాను. ఆ ఒక్కటి తప్ప భూములు, భవంతులపై నాకు ఆశ లేదు. విశాఖ, ఉత్తరాంధ్ర అభివృద్ధి మాత్రమే నా లక్ష్యం అని పేర్కొన్నారు.