Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Ap Cm Ys Jagan Conduct Review Meeting On Agriculture

సచివాలయ సిబ్బందికి శిక్షణ కల్పించండి: సీఎం జగన్

Published Date :September 1, 2021 , 9:26 pm
By ramakrishna
సచివాలయ సిబ్బందికి శిక్షణ కల్పించండి: సీఎం జగన్
  • Follow Us :
  • google news
  • dailyhunt

వ్యవసాయరంగంపై నేడు సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు.రాష్ట్రంలో వర్షపాతం, పంటలసాగు, ఇ–క్రాపింగ్, వ్యవసాయ సలహామండళ్ల సమావేశాలు, ఎరువుల పంపిణీ, వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలు, ఆర్బీకేల నిర్మాణ ప్రగతి తదితర అంశాలపై సీఎం సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం వివరాలను, సాగు వివరాలను అధికారులు సీఎంకు వివరించారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే.. ‘చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలి. చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలని సీఎం ఆదేశం ఆదేశించారు. బోర్లకింద, వర్షాధార భూములలో చిరుధాన్యాలు సాగుచేసేలా ప్రోత్సహించాలి. వరికి బదులు చిరుధాన్యాలు సాగుచేసినా ఆదాయాలు బాగా వస్తాయన్న అంశంపై రైతుల్లో అవగాహన కల్పించాలి. ఇలా చేస్తున్న రైతులను ప్రోత్సహించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. చిరుధాన్యాల సాగుచేస్తున్న రైతులకు మంచి గిట్టుబాటు ధర వచ్చేలా భరోసా కల్పించాలని, దీనివల్ల రైతులు మరింత ముందుకు వస్తారు.

వ్యవసాయ సలహామండళ్ల సమావేశాలు జరుగుతున్న తీరుపైనా సీఎం సమీక్షించారు. రైతులతో ఏర్పడ్డ వ్యవసాయ సలహామండళ్లలో వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు, సమస్యలు నేరుగా కలెక్టర్ల దృష్టికి వెళ్లాలి. వాటిని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి. డ్రైయిన్లు సహా ఇరత్రా పనులపై ఇప్పుడే వివరాలు తెప్పించుకుని దీనికి తగిన కార్యాచరణ సిద్ధంచేసుకోవాలి. రైతులు చెప్తున్న సమస్యలను తీర్చే బాధ్యత కచ్చితంగా అధికారులు తీసుకోవాలని, దీనిపై దృష్టిపెట్టాలి.

వ్యవసాయ సలహామండళ్ల కారణంగా సత్ఫలితాలు ఇస్తున్నాయన్న అధికారులు.. మార్కెట్లో డిమాండ్‌లేని వంగడాలను నిరుత్సాహ పరచడానికి సలహామండళ్లు కీలక పాత్ర పోషించాయన్న అధికారులు.. సుమారు లక్ష మందికిపైగా రైతులు వ్యవసాయ సలహామండళ్లలో ఉన్నారన్నారు అధికారులు.

రైతు భరోసా కేంద్రాలు – సేవలు

రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు కోరిన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలను నిర్దేశిత సమయంలోగా అందాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. రైతు భరోసాకేంద్రాల పనితీరు, సామర్థ్యం ఆమేరకు మెరుగుపడాలి. నాణ్యత ఉన్నవాటిని రైతులకు అందించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆర్బీకే కేంద్రాల ద్వారా కూడా రైతుల సమస్యలు నేరుగా ఉన్నతస్థాయికి తెలిసే వ్యవస్థనుకూడా సిద్ధంచేయాలి. అత్యాధునిక పరిజ్ఞానాన్ని (ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌) దీనికి వినియోగించుకోవాలి. నేచురల్‌ ఫార్మింగ్‌పైనా రైతులకు అవగాహన కల్పించాలి.

నేచురల్‌ ఫార్మింగ్‌ విధానాలను డిస్‌ప్లే చేయాలన్న సీఎం.. దీనికి సంబంధించిన సామగ్రి కావాలంటే వెంటనే రైతులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఆర్బీకే కేంద్రాలకు అనుబంధ భవనాలను విస్తరించుకుంటూ చిన్నపాటి గోడౌన్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అక్కడే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను నిల్వచేసుకోవచ్చని సీఎం తెలిపారు.

భవనాలను విస్తరించి నిర్మించేంతవరకూ అద్దె ప్రాతిపదికన కొన్ని భవనాలు తీసుకోవాలన్నారు. డిసెంబరులో వైయస్సార్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్స్‌ ప్రారంభం అవుతుందన్నారు. ఆర్బీకేల పనితీరు మీద కూడా సర్టిఫికెషన్‌ ఉండాలన్నారు. ఆర్బీకేల పనితీరుపై నిరంతర పర్యవేక్షణ, సమీక్షఉండాలన్నారు సీఎం.. ఆర్బీకేల పనితీరును మెరుగుపరిచే దిశగా ఐఎస్‌వో సర్టిఫికేషన్‌ పొందే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు సీఎం. దీనివల్ల వాటి పనితీరు క్రమంగా మెరుగుపడుతుందన్నారు. ఎప్పటికప్పుడు ఎస్‌ఓపీలను రూపొందించుకోవాలన్నారు.

వైయస్సార్‌ పొలంబడి

వైయస్సార్‌ పొలంబడి కార్యక్రమంపైనా సీఎం సమీక్షించారు. పొలంబడి కార్యక్రమాల షెడ్యూలును రైతు భరోసాకేంద్రాల్లో ఉంచాలన్నారు సీఎం జగన్.. 15 రకాల పంటలపై పొలంబడి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు సీఎం జగన్.. అగ్రికల్చర్‌కాలేజీలు, యూనివర్శిటీ విద్యార్థులు ఆర్బీకేల్లో విధిగా పనిచేసేలా చూడాలన్నారు.

ఆర్గానిక్‌ ఉత్పత్తులకు సర్టిఫికేషన్‌

ఆర్గానిక్‌ వ్యవసాయ ఉత్పత్తులకు సర్టిఫికేషన్‌ వచ్చేలా చూడాలన్నారు సీఎం జగన్.. ఇలాంటి ఉత్పత్తులకు మంచి ధర వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మోతాదుకు మించి అధికంగా ఎరువులు, పురుగు మందులు వాడుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. ఆర్బీకే యూనిట్లుగా మ్యాపింగ్‌చేసి ఆక్కడ రైతులకు పొలంబడుల ద్వారా ప్రత్యేక శిక్షణ, అవగాహన కల్పించాలన్నారు. పంటల సాగులో రైతులకు అవగాహన కల్పించేలా రూపొందించిన వీడియోలను యాప్‌ ద్వారా అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు.

ఇ– క్రాపింగ్‌పైనా సీఎం సమీక్ష

ఇ–క్రాపింగ్‌ చేసిన రైతులకు భౌతిక రశీదులు, డిజిటల్‌ రశీదులు కూడా ఇవ్వాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇ– క్రాపింగ్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. దీనివల్ల పూర్తి పారదర్శకత వస్తుందన్నారు. రుణాలు, సున్నావడ్డీ, ఇన్‌పుట్‌ సబ్సిడీలు, పంటల కొనుగోలు, బీమా… తదితర వాటన్నింటికీ ఇ–క్రాపింగ్‌ ఆధారం అవుతుందన్నారు. అన్ని ఆర్బీకేల్లో బ్యాకింగ్‌ కరస్పాండెంట్లు ఉండాలన్నారు. కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లలో భారీ పరికరాలను, సామగ్రిని అందుబాటులో ఉంచడమే కాకుండా ప్రతి ఆర్బీకే పరిధిలో కూడా రైతులకు అవసరమైన పనిముట్లను వ్యక్తిగతంగా అందించేలా కార్యాచరణ సిద్ధంచేయాలని, వచ్చే రబీ సీజన్‌లో అందుబాటులోకి తీసుకురావాలని సీఎం జగన్ సూచించారు.

హార్టికల్చర్‌లో విద్యార్హతలు ఉన్నవారు సరిపడా లేకపోవడంతో గ్రామ సచివాలయాల్లో ఉన్న 2038 పోస్టులు ఖాళీ ఏర్పడ్డాయి. అగ్రికల్చర్‌ అభ్యర్థులతోనే వీటిని భర్తీచేయడానికి సీఎం అంగీకారం తెలిపారు. వీరికి ఉద్యానవన పంటలపై తగిన శిక్షణ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. సీఎంయాప్‌ వినియోగంపై సచివాలయాల్లో సిబ్బందికి పూర్తిపరిజ్ఞానం ఉండాలన్నారు. ఆమేరకు శిక్షణ, అవగాహన కల్పించాలన్నారు. నాణ్యతా ప్రమాణాలు, కోత అనంతరం చర్యలు, వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత మెరుగుకోసం ఆర్బీకే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖను సీఎం ఆదేశించారు.

ట్రాన్స్‌ఫార్మర్‌ల సమస్యలు – పరిష్కారం

ఎక్కడ ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయినా వెంటనే కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ పెట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయిన చోట లోడ్, ఇతరత్రా పరిస్థితులపై వెంటనే పరిశీలన చేయాలన్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోవడానికి కారణాలపైన కూడా అధ్యయనం చేయించాలన్నారు. లేకపోతే కొత్తగా ట్రాన్స్‌ఫార్మర్‌ పెట్టినా ఉపయోగం ఉండదన్నారు. మీటర్లు అమర్చడం ద్వారా ఎంత కరెంటు కాలుతుంది, ఎంత లోడ్‌పడుతుందనే విషయం తెలుస్తుందన్నారు.

మీటర్ల వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవన్న విషయం ఇప్పటికే పలుమార్లు స్పష్టంచేశామన్నారు సీఎం. మీటర్ల వల్ల ఓ వర్గ మీడియాకు తప్ప, రైతులెవ్వరికీ నష్టంలేదన్నారు. ఈవిషయాన్ని రైతులు కూడా గుర్తించి మీటర్లు పెట్టించుకునేందుకు ముందుకు వచ్చారని గుర్తుచేశారు. మీటర్ల కారణంగా అధికారుల్లో జవాబుదారీతనం వస్తుందని, ఎంత లోడ్‌ పడుతుందని తెలుస్తోందని, దీనివల్ల ట్రాన్స్‌ఫార్మర్లు సహా మోటార్లు కాలిపోయిన పరిస్థితులను నుంచి బయటపడతామన్నారు. ఎంత బిల్లు కట్టాలో అంత డబ్బునూ ప్రభుత్వమే నేరుగా రైతుల ఖాతాల్లోకి వేస్తోందని, ఆ డబ్బు నేరుగా కరెంటు పంపిణీ సంస్థలకు చేరుతోందన్నారు సీఎం.

తమకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని విషయాన్ని రైతులు గ్రహించారన్నారు. రైతులకు నిరంతర విద్యుత్, సరఫరా, నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకోసం ఇప్పటికే ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందన్నారు. దీనికోసం ఫీడర్లను కూడా పెద్ద సంఖ్యలో విస్తరించామని జగన్ తెలిపారు. రైతులకు అవాంతరాల్లేని కరెంటుకోసం, ఉచిత విద్యుత్‌కోసం 10వేల మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టును కూడా తీసుకొస్తున్నామన్నారు. గ్రామ సచివాలయాల్లోని ఎనర్జీ అసిస్టెంట్‌ సేవలను అ విషయంలో వాడుకోవాలన్నారు సీఎం జగన్.

జిల్లా స్ధాయి వ్యవసాయ సలహా మండలి ప్రతినిధులతో రాష్ట్రస్ధాయిలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశానికి వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ప్రభుత్వ సలహాదారు (వ్యవసాయం) అంబటి కృష్ణారెడ్డి, ఏపీ స్టేట్‌ ఆగ్రో ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • agriculture
  • Andhra Pradesh
  • AP CM YS Jagan
  • AP CM YS Review Meeting
  • CM YS Jagan Mohan Reddy

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : మళ్లీ డ్రోన్లతో విరుచుకుపడుతున్న ఇరాన్‌..

  • Suriya46 : సూర్య – వెంకీ అట్లూరి సినిమా టైటిల్ ను ప్రకటించిన మేకర్స్

  • Team India History: ఐసీసీ టోర్నీల్లో భారత్ నయా చరిత్ర.. ఆస్ట్రేలియాకి కూడా సాధ్యం కాలేదు!

  • Toxic : ‘టాక్సిక్’ కోసం రవి బస్రూర్ మ్యూజికల్ మ్యాజిక్..

  • Vegetable Market: మరోసారి తెరపైకి కూరగాయల హోల్ సేల్ మార్కెట్ వివాదం

  • Sanju Samson: సంజూ సెలబ్రేషన్ వివాదం.. భావోద్వేగంలో బిగ్ మిస్టెక్.. ఐసీసీ చర్యలు తప్పవా?

ట్రెండింగ్‌

  • Sanju Samson Record: సంజు శాంసన్‌ రేర్ రికార్డు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్!

  • Sanju Samson: ఈ రోజు కోసమే ఎదురుచూశా.. నా జీవితంలో ఈ ఇన్నింగ్స్‌ను మర్చిపోలేను!

  • The IQ Era థీమ్‌తో MWC 2026 నేడే ప్రారంభం.. ఏ కొత్త ఫోన్ల లాంచ్‌ కానున్నాయంటే..!

  • Virendra Sehwag-MS Dhoni: ఎంఎస్ ధోనీ అదృష్టంతో జన్మించాడు.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • IND vs WI Super 8: ఈడెన్‌ గార్డెన్స్‌లో ‘కింగ్’.. అయినా భారత్‌ను వెంటాడుతున్న ఆ సమస్య!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions