ఆంధ్రా – ఒడిశా సరిహద్దులో మరోమారు భూవివాదం చర్చనీయాంశంగా మారింది. మందస (మం) సాబకోట పంచాయతీలోని మాణిక్యపట్నంలో ఒడిశా అధికారుల ఓవరాక్షన్ చేస్తున్నారు. మూడు రోజుల క్రితం ప్రభుత్వ భవనాలను ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేసారు. అడ్డుకున్న అంగన్వాడీ కార్యకర్త లక్ష్మి భర్త సవర గురునాథంను అరెస్ట్ చేసారు ఒడిశా పోలీసులు. పంచాయతీ ఎన్నికల తర్వాత మరోమారు తెరపైకి మాణిక్యపట్నం భూవివాదం వచ్చింది. ఈ వివాదం నేపధ్యంలో మాణిక్యపట్నాన్ని సందర్శించారు మందస తహశీల్దార్, ఎంపిడీఓ, డీఎస్పీ శివరామిరెడ్డి. ఇక ఒడిశా అధికారుల తీరుపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసారు స్థానిక అధికారులు . దాంతో సమస్యను మంత్రి సీదిరి అప్పలరాజు దృష్టికి తీసుకెళ్లారు జిల్లా అధికారులు.