విద్య..వైద్యం పై ముఖ్య మంత్రి జగన్ కు ప్రత్యేక శ్రద్ధ వుంది అని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. సీజనల్ వ్యాధులను గుర్తించేందుకు ఫీవర్ సర్వే ఉదృతి కొనసాగాలి. సచివాలయం.. వాలంటీర్ లను అప్రమత్తం చెయ్యండి అని సూచించారు. ఒక ఇంట్లో జ్వరం వస్తె సచివాలయం ఉద్యోగికి తెలిసేలా అధికారులు చర్యలు చేపట్టాలి. విశాఖ అన్ని రకాలుగా కేంద్రం కావడంతో రోగుల ఒత్తిడి వుంటుంది. ఆ పరిస్థితికి తగ్గట్టు కేజీహెచ్ లో వైద్య సదుపాయం వుండాలి. నిర్లక్ష్యంగా…
శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది టీటీడీ.. రేపటి నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్టు ప్రకటించింది… రేపటి నుంచి అలిపిరి వద్ద రోజుకి 2 వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనుంది తిరుమల తిరుపత దేవస్థానం.. అయితే, ప్రస్తుతం చిత్తూరు జిల్లా వాసులకు మాత్రతే టోకెన్లు జారీని పరిమితం చేయనుంది టీటీడీ.. కాగా, ప్రస్తుతం ఇస్తున్న దర్శనం కోటాలో 20 నుండి 30 శాతం సర్వదర్శనం ఉండేలా నిర్ణయం తీసుకోనున్నట్టు ఈ మధ్యే ప్రకటించారు టీటీడీ…
ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరులదే రాజ్యం. వారు ఎంత చెబితే అంత. ఎదురు తిరిగితే ఇంతే సంగతులు. ఎంతటి వారైనా కేడర్ చేతిలో దెబ్బలు తినాల్సిందే. కాదూ కూడదు అంటే ఎంతకైనా తెగిస్తుండటంతో.. అధికారపార్టీలో చర్చగా మారారు ఎమ్మెల్యే. ఇంతకీ ఎమ్మెల్యేకు తెలిసే అనుచరులు చేస్తున్నారా? తెలిస్తే ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకోవడం లేదన్నదే ప్రశ్న. కేడర్ రెచ్చిపోతుంటే.. ఎమ్మెల్యే మౌనం! కర్నూలు జిల్లా ఆదోని. సాయిప్రసాద్‌రెడ్డి ఎమ్మెల్యే. ఇక్కడ సాయి ప్రసాద్‌రెడ్డి కంటే అధికారపార్టీ నేతలుగా.. ఎమ్మెల్యే…
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. తెలంగాణలో విస్తారంగా.. కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండగా.. ఏపీలోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.. అయితే, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది వాతావరణశాఖ.. ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఈనెల 11న ఏర్పడే అవకాశం ఉందని.. కోస్తా ప్రాంతానికి ఎల్లో మెస్సేజ్ హెచ్చరికలు జారీ చేసింది. నిన్న ఏర్పడిన అల్పపీడనం బలపడి ఈరోజు దక్షిణ ఛత్తీస్‌గఢ్ మరియు దక్షిణ ఒడిశా ప్రాంతాలలో కొనసాగుతోందని..…
ఏపీలో కరోనా కేసులు సంఖ్య రోజు రోజుకు తగ్గుతూ వస్తోంది. తాజాగా ఏపీ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 54,970 సాంపిల్స్ పరీక్షించగా.. 1,178 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 10 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 1,266 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,23,242 కి పెరగగా.. కోలుకున్నవారి సంఖ్య 19,94,855 కి చేరింది..…
వినాయక చవితి ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ పెంచుతోంది… సీఎం వైఎస్ జగన్, ఏపీ సర్కార్‌పై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి… ఇక, వ్యవహారంలో సీఎం జగన్‌పై మండిపడ్డారు మాజీ మంత్రి కిడారి.. వినాయక చవితి వేడుకలు రద్దు చేయడం ఏంటి? అని ప్రశ్నించిన ఆయన.. కులాలు, మతాల మధ్య సీఎం జగన్ చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు.. వినాయక చవితి వేడుకలను ప్రభుత్వం రద్దు చేయడం సిగ్గు చేటు అని వ్యాఖ్యానించిన ఆయన.. తల్లిదండ్రులు వద్దంటున్నా…
విద్యాశాఖలో నాడు–నేడు, పౌండేషన్ స్కూళ్లుపై సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. అందులో సీఎం జగన్ మాట్లాడుతూ… నూతన విద్యావిధానం అమలు పై అన్ని రకాలుగా సిద్ధం కావాలి. పాఠ్యపుస్తకాల ముద్రణ నాణ్యతను పెంచాలి అని సూచించారు. కనీసం మూడో తరగతి నుంచి సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలి. స్కూళ్ల, టాయిలెట్ల నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ద చూపించాలి అని తెలిపారు. ఏదైనా సమస్య వస్తే వెంటనే చేయించడానికి కంటిజెన్సీ ఫండ్ ప్రతి స్కూల్లో ఉంచాలి.…
నకిలీ చనాల్ల స్కామ్ ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారింది. ప్రభుత్వ అధికారులు నకిలీ చలానాలతో కోట్ల రూపాయిలు అక్రమంగా కూడబెట్టారన్న వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో నకిలీ చలానాల కుంభకోణంపై రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న సబ్ రిజిస్ట్రార్లపై చర్యలు కూడా తీసుకున్నారు.. ఇప్పటికే కొందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు అధికారులు.. మరోవైపు.. నకిలీ చలాన్ల స్కామ్ వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్..…
చేతిలో పెద్దపదవి ఉంది. నియోజకవర్గంలో ఆయన చెప్పిందే వేదం. కానీ.. ఆయన స్పీడ్‌కు బ్రేక్‌లు వేస్తున్నాయి వైరిపక్షాలు. ఇదేం తలపోటు అని అనుకుంటున్న సమయంలోనే సొంత పార్టీ కేడర్ నుంచి చికాకులు పెరిగాయట. ఇదే అక్కడ హాట్ టాపిక్. ఆయన ఎవరో.. ఆ శిరోభారాలేంటో ఇప్పుడు చూద్దాం. తమ్మినేని కొబ్బరికాయ కొట్టగానే స్టే తెస్తున్నారా? శ్రీకాకుళం జిల్లాలో ఫ్యామిలీ పాలిటిక్స్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన ఆమదాలవలసలో ఇప్పుడు కొత్త తరహా రాజకీయాలు మొదలయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్…
పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయ్. డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయ్. పోటీగా.. గ్యాస్ కూడా ఆగనంటోంది. ఇలాంటి తరుణంలో.. ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రజలు దృష్టి పెడుతున్నారు. బైకులు, కార్లను బయటికి తీస్తున్నవారి సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. వారి ఆలోచనలు మారుతున్నాయి. కొందరైతే.. ఎలక్ట్రిక్ బైకులు కొనుగోలు చేస్తున్నారు. ఈ పరిణామాన్ని ఏపీ ప్రభుత్వం గుర్తించింది. ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో సరికొత్తగా ముందుకు పోతోంది. విజయవాడలో.. ఆటోలను ఎలక్ట్రిక్ గా మార్చేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 50 ఆటోలను ప్రయోగాత్మకంగా ఎంపిక…