Hyderabad Cyber Fraud: మామూలు కి’లేడి’ కాదయ్యో.. ఇల్లు గుల్ల చేసిందిగా!
- డాక్టర్‌ను మాయ చేసి రూ.14 కోట్లు స్వాహా చేసింది
- ఇల్లు అమ్మి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టిన డాక్టర్
- ప్లేటు తిప్పేసిన సైబర్ ముఠా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Cyber Fraud: మాయ మాటలు చెప్పి ఓ కిలేడి డాక్టర్‌ను మాయ చేసి, ఏకంగా ఆయన సొంత ఇంటిని అమ్మించి రూ.14 కోట్లు కొల్లగొట్టింది. ఈ సంఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. హైదరాబాద్‌కు చెందిన ఒక డాక్టర్ నుంచి ఈ కిలేడి ఏకంగా రూ.14 కోట్లు కొట్టేసింది. ఈ కిలేడి ముఠా తెలివిగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో డాక్టర్‌ను బురిడీ కొట్టించి, రూ.14 కోట్లు స్వాహా చేశారు.
Also Read
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ముందుగా సైబర్ నేరగాళ్లు అందమైన అమ్మాయి ఫోటోలతో డాక్టర్ని బుట్టలో వేసుకున్నారు. ఆ తర్వాత రంగంలోకి దిగిన కిలేడి ఆ డాక్టర్‌కు మెసేజ్ పెట్టి ట్రాప్ చేయడం స్టార్ట్ చేసింది. డాక్టర్ అందమైన అమ్మాయి ఫోటోల చూసి చాటింగ్ మొదలుపెట్టాడు. ఇదే అదనుగా ఈ కిలేడి చెలరేగి పోయింది.. తాను ఒక ఒంటరి మహిళని, స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన కంపెనీలో పని చేస్తానని డాక్టర్‌కు పరిచయం చేసుకుంది.
ఈ క్రమంలో డాక్టర్‌కు స్టాక్ మార్కెట్లో తమ కంపెనీ ద్వారా పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించింది. అందమైన అమ్మాయి చెబుతుందని అనుకున్నాడో, లేదంటే లాభాలకు అత్యాశకు పోయాడో కానీ ఆ డాక్టర్ ఈ కిలేడీని నమ్ముకుని సొంత ఇల్లును అమ్మి రూ.14 కోట్లు పెట్టుబడి పెట్టాడు. ఆ డాక్టర్ పెట్టుబడి పెట్టిన తర్వాత ఈ కిలేడి ముఠా ప్లేటు ఫిరాయించింది. దీంతో మోసపోయానని గుర్తించిన డాక్టర్ సైబర్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన అధికారులు డాక్టర్ కేసులో నలుగురిని అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా ఏసీపీ ప్రసాద్ మాట్లాడుతూ.. మోసపోయిన డాక్టర్‌ను సైబర్ కేటుగాళ్లు కంబోడియా నుంచి ట్రాప్ చేసి మోసం చేసినట్లు తెలిపారు. కంబోడియాలో తిష్ట వేసిన చైనా దేశస్థులు ఈ వ్యవహారం వెనకాల ఉన్నారని చెప్పారు. ఇండియా నుంచి ఉద్యోగాల పేరుతో యువకుల్ని తీసుకువెళ్లి బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నారని వెల్లడించారు. చైనీయులు మన దేశం వాళ్లతోనే ఇక్కడ సైబర్ నేరాలు చేయిస్తున్నారని తెలిపారు. ఈ కేసు విచారణలో కంబోడియాలో ఉన్న సైబర్ నేరగాలకు mule అకౌంట్స్ అందించిన నలుగురిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. నిందితులు mule అకౌంట్‌లోకి వచ్చిన డబ్బుల్ని వివిధ మార్గాల ద్వారా కాంబోడియాకి తరలించినట్లు గుర్తించినట్లు తెలిపారు.
READ ALSO: Sandeep Reddy Vanga: ‘ధురంధర్’పై సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రివ్యూ!
తాజావార్తలు
-
El Nino: ఎల్‌నినోతో భూమికి భారీ ముప్పు.. బద్దలుకానున్న రికార్డులు!
-
AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. ‘AA 23’పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
-
Harish Rao : ఎల్ నినో పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది
-
Navratri 2026: నవరాత్రుల్లో డిజిటల్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? మొబైల్‌కు దూరంగా ఉంటే ఆరోగ్యానికి ప్రయోజనాలివే
-
AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!