డ్రగ్ మాఫియాకు రాష్ట్రం అడ్డాగా మారింది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేను 40 ఏళ్ల పాటు రాజకీయాలు చూశాను. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఎప్పుడూ చూడలేదు అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం, పోలీసులు కుమ్మక్కై పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. ఆర్గనైజ్డుగా ఒకేసారి రాష్ట్రంలో వివిధ చోట్ల దాడులు చేశారు. పార్టీ కార్యాలయల పైనా దాడులు ఎప్పుడూ జరగలేదు. 100 మీటర్లలోపే డీజీపీ కార్యాలయం ఉన్నా.. దాడులు ఆపలేకపోయారు. డీజీపీకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు. గవర్నరుకు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేశారు.. పరిస్థితి వివరించాను. డీజీపీకి.. సీఎంకు తెలిసే ఈ దాడి జరిగింది. డ్రగ్ మాఫియాకు రాష్ట్రం అడ్డాగా మారింది అని అన్నారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ కోరల నుంచి బయటపడేయాలని కోరడం మా తప్పా అని ప్రశ్నించారు.
ఏపీలో గంజాయి ఉత్పత్తి చేసి దేశం మొత్తం సరఫరా చేస్తుంటే మేం ప్రశ్నించకూడదా అని అడిగారు. స్టేట్ టెర్రరిజానికి వ్యతిరేకంగా రాష్ట్ర బంద్ కు పిలుపిస్తున్నాం. పార్టీ కార్యాలయాలపై దాడి చేసి చంపేయాలని చూస్తారా.. పులివెందుల రాజకీయాలు చేస్తారా అని ప్రశ్నించారు. పార్టీ కార్యాలయంపై దాడులు చేసి చంపే ప్రయత్నం చేస్తోంటే డీజీపీ ఎక్కడ పడుకున్నారు. డీజీపీ నేరస్తులతో లాలూచీ పడతారా అన్నారు. ఇది టీడీపీకి సంబంధించిన విషయం కాదు.. ప్రజాస్వామ్యానికి సంబంధించిన విషయం. పార్టీ కార్యాలయం పైనా.. నేతల పైనా దాడులు జరిగితే.. ప్రజాస్వామ్యం ఎక్కడిది… శాంతి భద్రతలు ఫెయిల్ అయ్యాయి. డీజీపీ కార్యాలయం పక్కన దాడులు చేస్తే ఆర్టికల్ 356 ఎందుకు అమలు చేయకూడదు అని అడిగారు.
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
- Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
తాజావార్తలు
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
-
Shruti Haasan: మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలి.. వాళ్లకు ఆ బాధ తెలియాలి : శ్రుతి హాసన్ కామెంట్స్ వైరల్!
-
Oppo K14 Plus 5G: ఒప్పో K14 Plus 5G త్వరలో భారత్‌లో లాంచ్.. పనితీరు, డ్యూరబిలిటీపై ఫోకస్
-
Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!