జనసేన ‘డిజిటల్’ ఉద్యమం ప్రారంభం.. స్పందన లభించేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జనసేన పార్టీ డిజిటల్ ఉద్యమం చేపట్టింది. ఈ మేరకు ఈనెల 18 నుంచి 20 వరకు మూడు రోజుల పాటు జనసేన డిజిటల్ క్యాంపెయిన్ చేయనుంది. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో పోరాడాలని వైసీపీ, టీడీపీ ఎంపీలను ట్విట్టర్‌లో ట్యాగ్ చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ విషయంపై మన ఎంపీలకు బాధ్యత గుర్తు చేయాలని పవన్ ఆకాంక్షించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు పార్లమెంట్‌లో ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించాలని డిమాండ్ చేశారు.

మరోవైపు రాబోయే రోజుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకువెళ్ళాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. తద్వారా ఉక్కు కార్మికులు, వారి కుటుంబాలకు అండగా నిలుస్తామన్నారు. డిజిటల్ క్యాంపెయిన్ అనేది రాజకీయ పార్టీలకు అతీతంగా చేస్తున్న ఉద్యమం అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు చేసే ప్రతి ట్వీట్‌లో #raise_placards_andhra_mp అనే హ్యాష్ ట్యాగ్ వాడాలని సూచించారు. లోక్ సభ నియోజక వర్గం నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యుడికి, రాష్ట్రం నుంచి ఎన్నికైన రాజ్యసభ సభ్యులకు ట్యాగ్ చేయాలని సూచించారు.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
- Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
అయితే పవన్ పిలుపునిచ్చిన డిజిటల్ ఉద్యమానికి ఏ మాత్రం స్పందన లభిస్తుందో వేచి చూడాలి. అయినా డిజిటల్ ఉద్యమం వచ్చే లాభమేమిటో ఎవరికీ అర్థం కావడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రత్యక్ష పోరాటాలు లేదా పరస్పర సంప్రదింపులు చేయడం మానేసి డిజిటల్ ఉద్యమని చెప్పడం విచిత్రంగా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న పవన్ కేంద్రంలో తనకున్న పలుకుబడిని ఎందుకు ఉపయోగించడం లేదని నిలదీస్తున్నారు. ఇటీవల మంగళగిరిలో చేసిన దీక్షతో పవన్ ఏం సాధించారని.. ఇప్పుడు డిజిటల్ ఉద్యమం ఏం సాధిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణని వ్యతిరేకిస్తూ ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు @JanaSenaParty అధ్యక్షులు @PawanKalyan గారి పిలుపుమేరకు డిజిటల్ క్యాంపెయిన్ విశాఖ GVMC వద్ద జరిగినది#Raise_Placards_ANDHRA_MP #SaveVizagSteelPlant@MP_MvvOfficial @VSReddy_MP pic.twitter.com/V15OM3Wutu
— JSPShivaPrasad (@JSPShivaPrasad) December 18, 2021
తాజావార్తలు
-
Mandakini: ఆ ఒక్క ఫోటోతో నా కెరీర్ నాశనమైంది.. 30 ఏళ్ల వివాదంపై మౌనం వీడిన మందాకిని
-
Layoffs: 45ఏళ్లు దాటితే ఉద్యోగం ఊస్ట్? అంకుల్స్‌ను భయపెడుతున్న లెక్కలు!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Ibrahim Zadran: మేము బాగా ఆడాం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. అఫ్గాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Umar Khalid Documentary: IIIT-హైదరాబాద్‌లో ఉమర్ ఖాలిద్ డాక్యుమెంటరీ ప్రదర్శన.. CBFC హెచ్చరికతో కీలక మలుపు
ట్రెండింగ్
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!