భువనేశ్వరి గురించి మాట్లాడే అర్హత రోజాకు లేదు: టీడీపీ నేత అనురాధ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనురాధ విరుచుకుపడ్డారు. చిత్తూరు జిల్లా నగరిలో రోజాను వైసీపీ కార్యకర్తలే ఛీ కొడుతుంటే పారిపోయి తమ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించి రోజా మాట్లాడటం సిగ్గుచేటు అని అనురాధ ఆరోపించారు. వైసీపీ నేతలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఫస్ట్రేషన్‌తో రోజా తమ మేడమ్‌పై పిచ్చిపిచ్చిగా మాట్లాడుతోందని.. రోజా నాలుక తెగ్గోస్తామని హెచ్చరించారు. సూర్పణఖకు పట్టిన గతే రోజాకు టీడీపీ మహిళలు పట్టిస్తారని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు.
Read Also: నారా భువనేశ్వరికి రోజా కౌంటర్
Also Read
- Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
- PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
- Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
- Godavari Floods: గోదావరిలో పెరిగిన వరద ఉధృతి.. లంక గ్రామాలకు రాకపోకలు బంద్..
చిత్తూరు జిల్లాలో వరదలు వస్తే ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తమ మేడమ్ భువనేశ్వరి స్వయంగా స్పందించి ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున బాధితులకు సహాయం అందించారని అనురాధ వెల్లడించారు. భువనేశ్వరి తన వంతుగా రూ.49 లక్షలు ఆర్థిక సహాయం చేశారని గుర్తుచేశారు. అలాంటి మనిషిని అభినందించాల్సింది పోయి విమర్శించడానికి రోజాకు సిగ్గుండాలన్నారు. రోజాకు భువనేశ్వరి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కరోనా సమయంలోనూ భువనేశ్వరి బాధితులకు సహాయం అందించారని.. రోజా ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కనీసం స్పందించలేదన్నారు. మహిళా అధికారులను వైసీపీ నేతలు సోషల్ మీడియాలో హెరాస్ చేస్తుంటే రోజా మాట్లాడలేదన్నారు. వనజాక్షి మాటను ఇంకా ఎన్నాళ్లు రోజా వాడుకుంటుందని అనురాధ ప్రశ్నించారు. భువనేశ్వరిని వైసీపీ నేతలు ఏం అనకపోతే స్వయంగా మీడియా సాక్షిగా ఎందుకు క్షమాపణలు చెప్పారని రోజాను అనురాధ నిలదీశారు. జగన్‌ను పొగడటం తప్ప ప్రజల గురించి ఏనాడైనా రోజా పట్టించుకున్నారా అని ప్రశ్నించారు.
అధికారం కోసం తల్లిని, చెల్లిని వీధి వీధినా తిప్పి.. అధికారంలోకి వచ్చాక రోడ్డున పడేసిన జగన్ రెడ్డి కంటే మహిళా ద్రోహి దేశంలో ఎవరున్నారు రోజా రెడ్డీ.? – టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి @AnuradhaTdp మీడియా సమావేశం. https://t.co/NqnB8esmqL
— Telugu Desam Party (@JaiTDP) December 21, 2021
తాజావార్తలు
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
-
Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
-
Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Guest Habits: గెస్ట్‌గా వెళ్తున్నారా? పిలిచినవారు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!