ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిధుల వ్యవహారంలో ఉద్యోగులు నిరసన బాట పట్టారు.. మరోవైపు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో నిధుల బదలాయింపు ప్రక్రియ పూర్తి చేశారు అధికారులు.. రూ. 400 కోట్ల మేర వర్శిటీ నిధులను ఫైనాన్షియల్ సర్వీసు కార్పొరేషనులోకి బదలాయించారు వీసీ.. బదలాయింపు ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఓవైపు యూనివర్శిటీ ఉద్యోగుల ఆందోళన చేస్తున్నా.. ఈ ప్రక్రియను మాత్రం ఆపలేకపోయారు.. ఇక, ఈ వ్యవహారాన్ని తప్పుబడుతున్న ఉద్యోగులు విధులు బహిష్కరించి.. యూనివర్శిటీ ప్రారంగణంలో బైఠాయించారు. ఫైనాన్స్ కార్పొరేషన్ క్రెడిబిలిటీపై…
అమరావతి రాజధాని రైతులు ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరుతో మహాపాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. వారి పాదయాత్ర నేటితో 31వ రోజుకు చేరగా.. ఈరోజు నెల్లూరు జిల్లా మరుపూరు నుంచి రైతుల పాదయాత్ర ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో సర్వేపల్లి నియోజకవర్గంలోకి రాజధాని రైతుల పాదయాత్ర ప్రవేశించగా… వారికి టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు. ఈరోజు రైతుల పాదయాత్రలో బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు కూడా పాల్గొన్నారు. Read Also: తిరుమల దర్శనాలను వాయిదా…
ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెలకు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు. ఫిలింఛాంబర్లో సిరివెన్నెల పార్థివదేహానికి తెలంగాణ మంత్రులు హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ… సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం తెలుగు సినీ పరిశ్రమ, సాహిత్య కవులకు తీరని లోటు అని పేర్కొన్నారు. పండితులు, పామరులను ఆయన రచనలు మెప్పించాయన్న హరీష్‌రావు. సమాజంలో గొప్ప చైతన్యం కలిగించడానికి పాటలు రాశారని కొనియాడారు. సమాజంలో అసమానతలు తొలగించి చైతన్యం నింపేలా పాటలు…
వరుస వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ నష్టమే జరిగింది.. నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలను వర్షాలు అతలాకుతలం చేశాయి.. వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటుండగా.. మరో తుఫాన్ తీరంవైపు దూసుకొస్తోంది.. అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతోంది.. అది రేపటికి వాయుగుండంగా మారి ఆంధ్రప్రదేశ్ – ఒడిశా తీరం వైపు దూసుకొచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వాతావరణశాఖ అధికారులు… ఈనెల 3వ తేదీన అది తుఫాన్‌గా మారుతుందని.. ఆ తర్వాత 24 గంటల్లో…
అమరావతి : ఇవాళ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ పర్యటించనున్నారు. ఆయన తో పాటు.. నీతి ఆయోగ్ సభ్యులు కూడా ఏపీకి రానున్నారు. కృష్ణా జిల్లా వీరపనేని గూడెంలో రైతులతో ఈ సందర్భంగా నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ మాట్లాడనున్నారు. అనంతరం… రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయాన్ని సందర్శించి డ్వాక్రా మహిళల బృందాలతో భేటీ కానుంది నీతి ఆయోగ్ బృందం. ఇక ఆ తర్వాత… మధ్యాహ్నం సీఎం జగన్…
విజయవాడ నగరంలో చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తోందన్న వార్తలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. టూటౌన్ పరిధిలో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతున్నట్లు సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డయ్యాయి. అయితే చెడ్డీ గ్యాంగ్ ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడుతుందన్న విషయంపై పోలీసులకు స్పష్టత అందాల్సి ఉంది. చెడ్డీ గ్యాంగ్ సంచారంపై ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారి వల్ల ఎవరికైనా నష్టం కలిగితే ప్రజలు వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. Read Also: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు…
1) నేడు మూడోరోజు పార్లమెంట్ సమావేశాలు.. ఒమిక్రాన్ వేరియంట్‌పై కేంద్రం ప్రకటన చేసే అవకాశం2) హైదరాబాద్: నేడు ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల అంత్యక్రియలు.. హాజరుకానున్న ఏపీ మంత్రి పేర్ని నాని, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు3) కృష్ణా: కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై దాఖలైన పిటిషన్‌పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ4) నెల్లూరు: 31వ రోజుకు చేరిన రాజధాని అమరావతి రైతుల మహాపాదయాత్ర… నేడు మరపూరు నుంచి ప్రారంభం.. నేడు 12 కి.మీ. మేర సాగనున్న…
ఆయనదో టైపు..! అందరూ ఒకలా ఉంటే ఆయన మరోలా ఉంటారు. కమ్యూనిస్టు బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఆ నేతది ఎప్పుడూ డిఫరెంట్ స్టైలే. ఆయనకు పార్టీ కంటే సొంత ముద్ర వేసుకోవడమే బాగా ఇష్టం. తాజాగా ఆయన చేసిన పనితో పార్టీ విస్తుపోయింది.రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నియోజకవర్గమే అడ్డా.. అడ్డగోలు వ్యవహారాలు..? నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఏది చేసినా తన ముద్ర ఉండేలా చూసుకుంటారు. వరసగా రెండుసార్లు గెలిచిన కోటంరెడ్డి పార్టీకి తలనొప్పిగా…
ఆయన టీడీపీలో సీనియర్. అలాంటి నాయకుడి కుటుంబ రాజకీయ భవిష్యత్.. గందరగోళంలో పడిందా? ఆరుసార్లు గెలిచిన నాయకుడు.. ఒక్క ఓటమితో పక్కకెళ్లిపోయారు. ఆయన స్థానంలో బరిలో దిగిన తమ్ముడికీ వరస ఓటములే. దీంతో ఆ కుటుంబం పక్క నియోజకవర్గంపై కన్నేసినట్టు జోరుగా చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎవరా నాయకులు? ఏమా కథా? తుని సురక్షితం కాదని యనమల కుటుంబం భావిస్తోందా? టీడీపీలో కీలకంగా వ్యవహరించే మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు.. ఎన్నికల్లో పోటీ చేసి దశాబ్దంన్నరపైనే అయింది.…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రోజువారి కేసుల సంఖ్చ మరోసారి తగ్గింది… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 25,925 శాంపిల్స్ పరీక్షించగా.. 184 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో 3 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 134 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,04,17,082 కు చేరుకోగా… మొత్తం…