ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే కురిసిన వర్షాల ఎఫెక్ట్ ఇంకా తగ్గలేదు.. అప్పుడే మరో తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది… ‘జవాద్’గా నామకరణం చేసిన ఈ తుఫాన్ ఎఫెక్ట్.. ఉత్తరాంధ్రపై ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.. ఈ నేపథ్యంలో.. సంబంధిత జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైన చోట్ల సహాయ శిబిరాలు తెరిచేందుకు ఏర్పాటు చేయాలని సూచించిన ఏపీ సీఎం..…
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బహిరంగ లేఖ రాశారు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం… ఇప్పటికే పలు అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ నుంచి సీఎం వైఎస్ జగన్ వరకు లేఖలు రాస్తున్న ముద్రగడ.. ఈ సారి రైతుల సమస్యలను పేర్కొంటు ఏపీ, తెలంగాణ సీఎంలకు లేఖలు రాశారు.. ఇటీవల వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతు వెన్నెముక విరిగిపోచిందని.. తడిచిన ధాన్యం ప్రభుత్వాలు కొనుగోలు చేసి అన్నదాతలను ఆదుకోవాలని కోరారు. తడిచిన ధాన్యం నుంచి ఆల్కహాల్ స్పిరిట్…
ఏపీకి మరో తుఫాన్ ముప్పు ముంచుకొస్తోంది. అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మరో రెండ్రోజుల్లో తుఫాన్‌గా మారే అవకాశం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అండమాన్ సముద్రం పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని స్పష్టం చేసింది వాతావరణ శాఖ. మరికొన్ని గంటల్లో ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. తర్వాత మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి… తర్వాత తుఫాన్‌గా బలపడుతుందని అంటున్నారు వాతావరణ…
క్రిస్మస్, సంక్రాంతి పండగల దృష్ట్యా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌కు గడువు ను పొడిగించింది. దూర ప్రాంతాలకు వెళ్లే అన్ని బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ గడువును పొడిగించింది. ప్రస్తుతం 30 రోజుల ముందు మాత్రమే ముందస్తు రిజర్వేషన్ చేసుకొనేందుకు అవకాశం ఉంది. ఇవాళ్టి నుంచీ ఈ గడువును 60 రోజులకు పొడిగిస్తూ ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి…
భారీ వర్షాలతో నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి.. ఇక, తిరుపతి, తిరుమలలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు.. శ్రీవారి భక్తులను ఇబ్బందులకు గురిచేశాయి.. తిరుమల ఘాట్ రోడ్డులు కోతకు గురయ్యాయి.. ఏకంగా 13 ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడం, నాలుగు ప్రాంతాల్లో రోడ్డు దెబ్బతినడంతో.. తిరుమలకు రాకపోకలపై ఆంక్షలు కూడా విధించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, ఇవాళ తిరుమల ఘాట్ రోడ్డును పరిశీలించనుంది ఢిల్లీ ఐఐటీ నిపుణుల బృందం. Read Also: జవాద్ తుఫాన్ ఎఫెక్ట్..…
ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయ్యింది… కుండపోత వానలు.. ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చే వరదలతో రాయలసీమ, కోస్తాఆంధ్రాలో కొన్ని ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి.. అయితే, ఇప్పుడు మరో తుఫాన్ ఏపీ వైపు దూసుకొస్తోంది.. ఇప్పటికే ఆ తుఫాన్‌కు ‘జవాద్ తుఫాన్’గా నామకరణం చేశారు అధికారులు.. అండమాన్ నికోబార్ తీరం వద్ద ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారబోతోంది.. జవాద్ ఎఫెక్ట్‌తో ఒడిషాతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.. అయితే,…
ఇవాళ రాయలసీమ జిల్లాల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలైన వైయస్సార్ కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో సీఎం జగన్ ఇవాళ, రేపు పర్యటించనున్నారు. ఇవాళ వైయస్సార్ కడప, చిత్తూరు జిల్లాలలో పర్యటించి నేరుగా బాధిత ప్రజలు, రైతులతో సీఎం ఇంటరాక్ట్ కానున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ నేపథ్యం లో భారీ వర్షాలకు దెబ్బతిన్న అన్నమయ్య ప్రాజెక్టును సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిశీలించనున్నారు. అంతేకాదు… ప్రాజెక్టు పరిసర గ్రామాల…
రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం కేంద్రంతో పరస్పర సహకారంతో సమాఖ్య స్ఫూర్తి కొనసాగేలా మా వంతుగా కృషి చేస్తాము అని నీతిఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్‌కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు అభినందనీయం, ఆదర్శప్రాయం. దేశంలో తొలిసారిగా వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఈ విషయంలో నాకెంతో నమ్మకం ఉంది. గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు. వ్యవసాయానికి అండ, రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ, వికేంద్రీకరణ ప్రక్రియలు…
మధిర టీఆర్ఎస్ కౌన్సిలర్ మల్లాది వాసు ఇటీవలే కొన్ని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబును భౌతికంగా నిర్మూలించాలని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెనుదుమారం రేపుతున్నాయి. కౌన్సిలర్ మల్లాది వాసు వ్యాఖ్యలపై వల్లభనేని వంశీ స్పందించారు. సమాజానికి ఎంతో సేవ చేస్తున్న సామాజిక వర్గాన్ని కుట్రలు, కుతంత్రాల వైపు చంద్రబాబు నడిపిస్తున్నారు. Read: 2021 బెస్ట్ యాప్‌లు ఇవే… మల్లాది వాసు లాంటి వారిని వివిధ పార్టీల్లో…