సమాజంలో మార్పు రావాలంటే.. పాఠ్యాంశాల్లో మార్పు వస్తేనే అది సాధ్యం అవుతుందన్నారు స్వామి పరిపూర్ణానంద.. శ్రీకాకుళంలో జరిగిన సమాలోచన సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాఠ్యాంశాల్లో మార్పు వస్తేనే సమాజంలో మార్పు వస్తుందని వ్యాఖ్యానించారు. దేశభక్తి పెంపొందించాలంటే బాబర్, హుమయూన్, ఖిల్జీల చరిత్ర పాఠ్యంశాలలో చించేయాలన్న ఆయన… అశోకుడు, రాణాప్రతాప్, శివాజీ, వివేకానందుడి చరిత్ర నాన్ టేయిల్‌లో పెట్టాలని కోరారు.. ఇక, సన్యాసులు వేదాంతం చెప్పడమే కాదు.. సమూలమైన మార్పుకి దోహాదపడాలని సూచించారు పరిపూర్ణానంద.. ప్రస్తుతం ఓటు వేసే విషయంలో ఏం ఇచ్చారో ఆలోచిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన… ఇంకా ఓటు వినియోగంలో పరాధీనత కొనసాగుతోందన్నారు.
Read Also: ఆ సింగిల్ డోస్ వ్యాక్సిన్‌కు భారత్ అనుమతి..