ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఆందోళనలు చేపట్టాయి. టీడీపీ, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో పలు చోట్ల కార్యకర్తలు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా తిరుపతి నాలుగు కాళ్ల మండపం వద్ద టీడీపీ నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. లాంతర్లు నెత్తిపై పెట్టుకుని విసనకర్రలతో విసురుకుంటూ బల్బులను మెడలో వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. చేతగాని సీఎం డౌన్ డౌన్ అంటూ…
ఏపీలో ప్రభుత్వాస్పత్రిలో మహిళలు ప్రసవించిన అనంతరం సురక్షితంగా ఇంటికి చేరేందుకు వైఎస్ఆర్ తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను ప్రభుత్వం ప్రారంభించింది. దాదాపు 500 వాహనాలను శుక్రవారం సీఎం జగన్ విజయవాడ బెంజి సర్కిల్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మారుతున్నాయని వెల్లడించారు. టీడీపీ హయాంలో అరకొరగా ఉన్న తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల స్థానంలో 500 కొత్త వాహనాలను ప్రారంభించామని తెలిపారు. అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు అత్యాధునిక…
రోజుకు రోజుకు ఎండలు పెరుగుతున్నాయి. వేసవి తాపంతో అటు చిన్నారుల నుంచి ఇటు వృద్ధుల వరకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో స్కూళ్లకు సంబంధించి ఒంటి పూట బడుల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 4 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. వేసవి తీవ్రత ఆధారంగా విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 7:30…
2019 ఎన్నికలకు ముందు సీఎం జగన్ ఇచ్చిన హామీలు, ప్రస్తుతం చేస్తున్న పనులను ఉదహరిస్తూ టీడీపీ నేత నారా లోకేష్ సెటైరికల్ వీడియోను ట్వీట్ చేశారు. వైసీపీ ప్రొడక్షన్స్ సమర్పించు అత్యద్భుతమైన సినిమా ‘జనం చెవిలో జగన్ పూలు’ ఏప్రిల్ 1న విడుదల అని లోకేష్ ఈ వీడియోకు క్యాప్షన్ పెట్టారు. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు, మద్యనిషేధం, ప్రత్యేక హోదా, సన్నబియ్యం పంపిణీపై ఇచ్చిన హామీలను ఇప్పుడు తుంగలో తొక్కారని.. ప్రజలను జగన్ ఏప్రిల్ పూల్…
ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రశంసలు కురిపించారు. గురువారం పార్లమెంట్ సెంట్రల్ హాలుకు వచ్చిన సీఎం స్టాలిన్‌ను పలువురు వైసీపీ ఎంపీలు కలిశారు. స్టాలిన్‌ను కలిసిన వారిలో వైసీపీ ఎంపీలు మార్గాని భరత్, గోరంట్ల మాధవ్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, మోపిదేవి వెంకటరమణ, విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, రెడ్డప్ప, లావు శ్రీకృష్ణదేవరాయలు, వంగా గీత, తలారి రంగయ్య ఉన్నారు. వీరిని డీఎంకే ఎంపీ కనిమొళి సీఎం స్టాలిన్‌కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా…
ఉగాది పండగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి మొత్తం ఐదు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. సికింద్రాబాద్-తిరుపతి, మచిలీపట్నం-తిరుపతి, కాకినాడ-తిరుపతి, కాకినాడ-వికారాబాద్, తిరుపతి-మచిలీపట్నం మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ప్రత్యేక రైళ్ల వివరాలు: ★ సికింద్రాబాద్-తిరుపతి (రైలు నం: 07597) రైలు ఏప్రిల్ 1న రాత్రి 8:15 గంటలకు బయలుదేరుతుంది ★ మచిలీపట్నం-తిరుపతి (రైలు నం: 07095)…
ఉగాది పండగ సందర్భంగా ఏప్రిల్ 2వ తేదీని సెలవుగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ అధికారి ముత్యాలరాజు నోటిఫికేషన్ జారీ చేశారు. గతంలో ఏప్రిల్ 2న కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా ఉగాది సెలవు లేదని ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై ప్రభుత్వ ఉద్యోగుల నుంచి పలు విజ్ఞప్తులు రావడంతో అధికారులు సమీక్షించి కొత్త జిల్లాల ఏర్పాటును రెండు రోజుల పాటు వాయిదా వేశారు. కాగా కొత్త జిల్లాల ఏర్పాటు…
★ నేడు విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద 500 వైఎస్ఆర్ తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను ప్రారంభించనున్న సీఎం జగన్★ ఏపీలో పెరిగిన టోల్‌ప్లాజా రేట్లు.. నేటి నుంచి అమలు★ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ నేడు ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో నిరసనలు, ధర్నాలు★ తిరుమల: నేటి నుంచి ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి, రేపు శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం★ ప్రకాశం: మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లాగా చేయాలంటూ నేడు…
తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలిలో నేర చరితుల్ని సభ్యులుగా చేర్చడంపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘోరమైన నేరాలకు పాల్పడిన కొందరు వ్యక్తులు ఇటీవల టీటీడీ పాలకమండలిలో సభ్యులుగా చేరారని అటువంటి వారిని వెంటనే తొలగించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. నేరచరిత ఉన్నవారిని ఆలయ పాలకమండలిలో సభ్యులుగా ఎలా నియమిస్తారని.. భగవంతుని సేవలో నేరచరితులు ఉండటాన్ని ఉపేక్షించేది లేదంటూ ప్రభుత్వంపై, టీటీడీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.…