టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుకు నోటీసులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్.. ఈ నెల 27వ తేదీన కమిషన్ ముందు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది… విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాచార ఘటన కలకలం సృష్టించగా.. ఇవాళ అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు నేతలు క్యూ కట్టారు.. ఏపీ మంత్రులతో పాటు.. టీడీపీ నేతలు కూడా ఆస్పత్రికి వెళ్లారు.. ఈ క్రమంలో.. ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మతో టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.. ఇదే ఇప్పుడు నోటీసులకు కారణమైంది.
Read Also: Cash Transfer: ఏపీలో రేషన్ నగదు బదిలీ వాయిదా.. కారణం ఇదే..!
విజయవాడ ఆస్పత్రిలో వాసిరెడ్డి పద్మ, టీడీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.. మహిళా కమిషన్ చైర్‌పర్మన్ వాసిరెడ్డి పద్మ.. చంద్రబాబు మధ్య వాగ్వాదం జరిగింది.. అయితే, వాసిరెడ్డి పద్మను అగౌరవపరచడం.. బాధితురాలి ఆవేదన కూడా విననీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడం సరికాదని.. ఈ ఘటనలపై విచారణకు చంద్రబాబు, బొండా ఉమ వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ సమన్లు జారీ అయ్యాయి.. ఈనెల 27వ తేదీన ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి చంద్రబాబు, బొండా ఉమామహేశ్వరరావు వ్యక్తిగతంగా విచారణకు రావాలని ఆ నోటీసుల్లో ఆదేశాలు జారీ చేసింది ఏపీ మహిళా కమిషన్.